Mohanbabu: కోట శ్రీనివాసరావు మరణం.. మోహన్‌బాబు ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:34 PM
కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) కుటుంబాన్ని నటుడు మంచు మోహన్‌బాబు పరామర్శించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని కోట ఇంటికి చేరుకుని నివాళి అర్పించారు
కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) కుటుంబాన్ని నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) పరామర్శించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని కోట ఇంటికి చేరుకుని నివాళి అర్పించారు. కోట శ్రీనివాసరావు మరణం రోజున హైదరాబాద్‌లో లేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని, విష్ణుకు మంచి పేరు వచ్చిందని అందరూ అంటుంటే వినాన్నని నాతో ఫోన్‌లో చెప్పారు.
1987 సంవత్సరంలో ‘వీరప్రతాప్’ అనే సినిమాలో మాంత్రికుడుగా మెయిన్ విలన్‌గా నా బ్యానర్‌లో నటించారు. నా సంస్థలోనే కాకుండా బయటి నిర్మాణ సంస్థల్లో కూడా మేమిద్దం ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల గొప్ప నటుడు కోట. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ పాత్రలు పోషించారు. పాత్ర పాత్రకు వైవిధ్యం చూపించేవారు. ఎలాంటి డైలాగ్ అయిన అలవోకగా, డిఫరెంట్ మాడ్యులేషన్స్‌లో చెప్పగలిగే ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు. ఆయనతో మా కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆయన మరణం నా కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని మోహన్‌బాబు అన్నారు.
Pawan kalyan Press meet: రత్నంగారు నలిగిపోవడం చూడలేక.. పవన్ ప్రెస్‌మీట్
Kantara surprise glimpse: గ్లింప్స్ తో సర్‌ప్రైజ్ చేసిన రిషబ్ శెట్టి
Pawan Kalyan: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎ.ఎం.రత్నం!