Mohanbabu: అల్లు ఫ్యామిలీని పరామర్శించిన మోహన్‌బాబు..
ABN , Publish Date - Sep 01 , 2025 | 09:59 AM
మంచు మోహన్ బాబు అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదివారం సాయంత్రం అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు
నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (Allu Kanakaratnam) శనివారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నఆమె శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న మంచు మోహన్ బాబు అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదివారం సాయంత్రం అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని కనకరత్నమ్మకు నివాళులు అర్పించి, భావోద్వేగానికి లోనయ్యారు.
అల్లు ఫ్యామిలీతో కాసేపు గడిపి ధైర్యానిచ్చారు. ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మోహన్ బాబు, అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత అల్లు అరవింద్‌తో అంతే అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
ALSO READ: Dragon: ఎన్టీఆర్‌కు జోడీ కుదిరింది..
Monday Tv Movies: సోమవారం, సెప్టెంబర్ 01.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
Krish Jagarlamudi: స్వీటీపై మాట పడకుండా బాగానే కవర్ చేశాడే
Allu Arjun: ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు! అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్