Meher Ramesh: పవన్ తో సినిమా.. జనాల్ని చంపేస్తావా
ABN, Publish Date - Jul 15 , 2025 | 09:23 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో బిజీ ఉన్న విషయం తెలిసిందే. పదవి వచ్చాకా పవన్ సినిమాలు ఆపేస్తాడు అని అనుకున్నారు. కానీ, పవన్ మాత్రం సినిమాలు ఆపే ప్రసక్తే లేదన్నట్లు వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడని టాక్.
Meher Ramesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో బిజీ ఉన్న విషయం తెలిసిందే. పదవి వచ్చాకా పవన్ సినిమాలు ఆపేస్తాడు అని అనుకున్నారు. కానీ, పవన్ మాత్రం సినిమాలు ఆపే ప్రసక్తే లేదన్నట్లు వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడని టాక్. ఇదంతా పక్కన పెడితే.. డైరెక్టర్ మెహర్ రమేష్ (Meher Ramesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా సినిమాతో మెహర్ రమేష్ తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas).. మెహర్ చూపించినంత స్టైలిష్ గా ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చూపించలేదు అన్న మాట వాస్తవం. ఆ తరువాత మెహర్ నుంచి వచ్చిన శక్తి, షాడో సినిమాలు టాలీవుడ్ లోనే భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి.
మెగాస్టార్ చిరంజీవికి మెహర్ బంధువు కావడంతో.. మనోడికి మనమే ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా అనుకొని భోళా శంకర్ తో ఒక ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా మెహర్ దశను మార్చలేకపోయింది. చిరు కెరీర్ లోనే డిజాస్టర్ టాక్ ను తీసుకొచ్చిపెట్టింది. దీంతో మెహర్.. సినిమాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ప్రేక్షకులు తేల్చి చెప్పేశారు. ఇక అక్కడితో సైలెంట్ ఉన్న మెహర్ సడెన్ గా మెగా ఫ్యాన్స్ గుండెల్లో పెద్ద బాంబ్ పేల్చేశాడు. ఈమధ్య మెహర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కచ్చితంగా పవన్ తో ఒక సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఎప్పుడో పవన్ కల్యాణ్ తనకు మాట ఇచ్చాడని, ఆయన కోసం కథను కూడా రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఒక్క మాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
చిరంజీవి ఒప్పుకున్నట్లు ఈసారి పవన్ కూడా ఒప్పుకుంటే పరిస్థితి ఏంటి..? అని అభిమానులు భయపడుతున్నారు. ఇచ్చిన మాటకు పవన్ ఏ రేంజ్ లో కట్టుబడి ఉంటాడో అందరికీ తెలిసిందే. బంధువు కాబట్టి కాదనలేక.. అవును అంటే పవన్ కెరీర్ లో ఇంకో డిజాస్టర్ వస్తే తట్టుకొనే శక్తి మాకు లేదని పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఎప్పుడో ఇంటర్వ్యూలో మెహర్ చెప్పిన మాటలు ఇప్పుడెందుకు వైరల్ చేస్తున్నారో అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా మా అన్నను వదిలేయ్ .. ప్లీజ్ మెహర్ అంటూ కొందరు.. జనాల్ని చంపేస్తావా అని ఇంకొందరు.. అంత పని మాత్రం చేయకు అని పవన్ ఫ్యాన్స్ మెహర్ రమేష్ ను వేడుకుంటున్నారు. ఇదే నిజం అయితే మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను తట్టుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. మరి పవన్ .. మెహర్ కి ఛాన్స్ ఇస్తాడా..? లేదా..? అనేది చూడాలి.
Kingdom Second Single Promo: అన్నదమ్ముల అనుబంధం.. మరో చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే
Singer Arijit Singh: డైరెక్టర్ గా మారుతున్న స్టార్ సింగర్..