Chiranjeevi: చిరు గొప్ప మనసు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి విరాళం
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:18 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా అందించారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా అందించారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను కలిసి కోటి రూపాయల చెక్ ను అందించారు. ఈమధ్య ఏపీలో వరదలు ముంచెత్తిన విషయం తెల్సిందే. అందులో చాలామంది ఆశ్రయాలను కోల్పోయారు. వారికి అండగా తనవంతు సాయంగా చిరు కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ చిరు గొప్పమనసును ప్రశంసిస్తున్నారు. అందుకే నువ్వు మెగాస్టార్ అయ్యావని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సగానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలు కాకుండా చిరు పుట్టినరోజున మెగా 158.. బాబీ కొల్లితో అధికారికంగా ప్రకటించారు. దీని తరువాత శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా ఉంది. ఇలా ఈ వయస్సులో కూడా అస్సలు రెస్ట్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారారు చిరు. మరి ఈ సినిమాలతో మెగాస్టార్ ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.
Brahmaji: 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. అబ్బబ్బా కన్నుల పండుగగా ఉందే
Madharaasi Trailer: ఇది నా ఊరు సార్.. నేను వదలను