Madharaasi Trailer: ఇది నా ఊరు సార్.. నేను వదలను
ABN , Publish Date - Aug 24 , 2025 | 07:48 PM
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అమరన్ లాంటి హిట్ సినిమా తరువాత శివ కార్తికేయన్ నుంచి వస్తున్న సినిమా మదరాశి(Madharaasi).
Madharaasi Trailer: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అమరన్ లాంటి హిట్ సినిమా తరువాత శివ కార్తికేయన్ నుంచి వస్తున్న సినిమా మదరాశి(Madharaasi). స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో విద్యుత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మదరాశి సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మదరాశి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. 'నీలాగే ఇతరులను ప్రేమించు.. అందరూ నీ కుటుంబమే అనుకో.. అదే అందరూ దేవుళ్లు చెప్పింది' అని రుక్మిణి వసంత్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఈ సినిమాలో రఘు అనే పోలీస్ ఆఫీసర్ గా శివ కార్తికేయన్ కనిపించాడు. ప్రేమించిన అమ్మాయితో ఎంతో హ్యాపీగా ఉండే రఘు జీవితం ఒక్క బాంబ్ తో బ్లాస్ట్ తో తల్లకిందులవుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ తరువాత రఘు జీవితంలో ఏం జరిగింది.. ? దేనికోసం అతడు అంతలా పోరాడుతున్నాడు.. ? బాంబ్ బ్లాస్ట్ తో విద్యుత్ కు ఉన్న సంబంధం ఏంటి.. తన సొంత ఊరును వదిలి వెళ్లమని రఘును ఎవరు బెదిరించారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ కట్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. ఏఆర్ మురుగదాస్ ఎలాంటి సినిమాలను అందించాడో ప్రేక్షకులకు బాగా తెలుసు. అక్కడక్కడా ఈ ట్రైలర్ చూస్తుంటే స్పైడర్ సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. శివ కార్తికేయన్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఇక రుక్మిణి, శివ కార్తికేయన్ జంట మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. అనిరుధ్ తన తో మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేస్తాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాపైనే ఏఆర్ మురుగదాస్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. కొన్నేళ్ళుగా ప్లాప్ ల మధ్య తిరుగుతున్న ఆయనకు.. మదరాశి హిట్ ఇస్తాడో.. లేక ప్లాప్ ఇస్తాడో చూడాలంటే.. సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.
Ananya Nagalla: ఎవర్రా మృణాల్.. బ్యాక్ చూపించి అల్లాడిస్తున్న తెలుగమ్మాయి
OG Movie: ప్లాప్ సినిమాలను గుర్తుచేస్తున్న సువ్వి సువ్వి పోస్టర్