Brahmaji: 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. అబ్బబ్బా కన్నుల పండుగగా ఉందే

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:25 PM

ఇండస్ట్రీ.. ఒక బిజీ ప్రపంచం. ఇక్కడ ఎవరికీ తీరిక ఉండదు. ఒక సినిమా రెండు నెలలు కలిసి చేస్తే చేస్తే.. ఆ రెండు నెలలు కలవడం తప్ప ఆ తరువాత ఎవరికీ ఉండవు. అలా ఏళ్ల తరబడి కలవకుండా ఉన్నవారు కూడా ఉన్నారు.

Tollywood

Brahmaji: ఇండస్ట్రీ.. ఒక బిజీ ప్రపంచం. ఇక్కడ ఎవరికీ తీరిక ఉండదు. ఒక సినిమా రెండు నెలలు కలిసి చేస్తే చేస్తే.. ఆ రెండు నెలలు కలవడం తప్ప ఆ తరువాత ఎవరికీ ఉండవు. అలా ఏళ్ల తరబడి కలవకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటివారందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఒకప్పటి సీనియర్ నటులు.. డైనమిక్ డైరెక్టర్స్ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటే.. వాళ్లకు ఎలా ఉంటుందో తెలియదు కానీ, వారందరిని ఒకే ఫ్రేమ్ లో చూసిన ప్రేక్షకులకు మాత్రం కన్నుల పండగగా ఉంటుంది. ప్రస్తుతం అదే అనుభూతిలో ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.


దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా, డైరెక్టర్స్ గా కొనసాగుతున్న కొంతమంది గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీని ఏర్పాటు చేసింది కమెడియన్, నిర్మాత అయిన బండ్ల గణేష్. పాత స్నేహితులను కలవడం బండ్లన్నకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఇక తాజాగా తన పాత మిత్రులతో పాటు స్టార్ డైరెక్టర్స్ ను కూడా పిలిచి తన ఇంట్లోనే పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ కృష్ణవంశీ తో పాటు సీనియర్ నటులు శివాజీ రాజా, శివాజీ, శ్రీకాంత్, రాజా రవీంద్ర, ఆలీ, బ్రహ్మాజీ, బండ్ల గణేష్ తదితరులు పాల్గొని సందడిగా గడిపారు.


ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను బ్రహ్మాజీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. మన బండ్లన్న ఇంట్లో అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ ఫొటోలో ఉన్నవారందరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొంతమంది బిజీ బిజీగా సినిమాలు చేస్తుండగా.. కొందరు నెమ్మదిగా అడపాదడపా కనిపిస్తున్నారు. ఏదిఏమైనా వీరందరినీ ఇలా చూస్తుంటే అప్పటి రోజులు గుర్తొస్తున్నాయని, ఆ రోజుల్లో తీసిన సినిమాలు .. వీరి బంధాలు వేరే లెవెల్. ఇప్పుడు వీరందరూ కలిసి ఒక సినిమా తీస్తే బావుంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Madharaasi Trailer: ఇది నా ఊరు సార్.. నేను వదలను

Ananya Nagalla: ఎవర్రా మృణాల్.. బ్యాక్ చూపించి అల్లాడిస్తున్న తెలుగమ్మాయి

Updated Date - Aug 24 , 2025 | 08:25 PM