Yellamma: దేవిశ్రీ పక్కన మహానటి.. ఒప్పుకుంటుందా
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:54 PM
ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్లు అయిపోయింది ఎల్లమ్మ (Yellamma) పరిస్థితి. బలగం లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వేణు (Venu) ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యిపోయాడు.
Yellamma: ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్లు అయిపోయింది ఎల్లమ్మ (Yellamma) పరిస్థితి. బలగం లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వేణు (Venu) ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యిపోయాడు. దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లో రెండో సినిమాను ఫైనల్ చేశాడు. నాని హీరోగా ఎల్లమ్మ కన్ఫర్మ్ చేశాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది అనుకొనేలోపు పడింది బ్రేక్. అక్కడి నుంచి బ్రేకులా మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి.
నాని కథ నచ్చలేదు అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత నితిన్ వచ్చాడు. హిట్స్ లేవు.. దిల్ రాజు మళ్లీ రిస్క్ తీసుకోలేను అనుకోని వదిలేశాడు. తరువాత శర్వా వచ్చాడు.. అది కుదరలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ వచ్చాడు సెట్ అవ్వలేదు. చివరకు దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా చేయాలనీ దిల్ రాజు నిర్ణయించాడు. ఇక్కడవరకు బావుంది. దేవి పక్కన హీరోయిన్ ఎవరు.. ? కొత్త హీరోయిన్ ను తీసుకుంటే బెటర్ అనుకొనేలోపు తెరపైకి మహానటి పేరు వచ్చింది.
నితిన్ తో ఎల్లమ్మ అనుకున్నప్పుడే కీర్తి సురేష్ ను కన్ఫర్మ్ చేశాడు హార్ట్ కింగ్. నితిన్ ప్లేస్ లోకి దేవి వచ్చాడు. మరి కీర్తి ఉంటుందా.. ? ఇప్పుడు అదే మిస్టరీగా మారింది. కొత్త హీరో.. కథ బావున్నా.. పెయిర్ కూడా బావుండాలి కదా అనేది కొందరి వాదన. స్టార్ హీరోయిన్ ఉన్న కీర్తి ఇప్పుడు దేవితో రొమాన్స్ చేస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయమే. అందులోనూ దిల్ రాజు బ్యానర్ లో ఆల్రెడీ ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తుంది. వెంటనే మరో సినిమాకు ఒప్పుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఒప్పుకుంటే కీర్తిపై ట్రోల్స్ రావడం పక్కా అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Vishal: 119 కుట్లు.. అంత రిస్క్ ఎందుకు బ్రో
They Call Him OG: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్