Vishal: 119 కుట్లు.. అంత రిస్క్ ఎందుకు బ్రో
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:18 PM
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ గురించిన ఒక న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం కూడా విదితమే.
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ గురించిన ఒక న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం కూడా విదితమే. డైరెక్టర్ తో విభేదాల వలన మకుటం సినిమా ఆగిపోయిందని, ఆ సినిమాకు విశాల్ నే దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఇదేమి విశాల్ కి కొత్త కాదు.
ఇక ఈ విషయం పక్కన పెడితే.. విశాల్ తాజాగా ఒక పాడ్ కాస్ట్ ను మొదలుపెట్టనున్నాడు. యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ అనే పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ పాడ్ కాస్ట్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో విశాల్ తన మనోగతాన్ని మొత్తం విప్పాడు. తన కెరీర్ మొదలైనప్పటి నుంచి మధ్యలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. స్నేహితులు ఎవరు.. శత్రువులు ఎవరు.. ఇవన్నీ చెప్పుకొచ్చాడు.
ఇక సినిమా కోసం తానెంత రిస్క్ చేశాడు అనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. తనకు సినిమాలో డూప్స్ వాడడం ఇష్టం ఉండదు అని, ఎంత రిస్క్ స్టంట్ అయినా కూడా తానే చేస్తాను అని చెప్పుకొచ్చాడు. అలా సెట్ లో తగిలిన దెబ్బలు వలన తన శరీరంలో 119 కుట్లు పడ్డాయని విశాల్ తెలిపాడు. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రోమో చూసిన అభిమానులు అంత రిస్క్ ఎందుకు బ్రో.. అవసరం లేదు నువ్వు సేఫ్ గా ఉండు అని కొందరు చెప్తుండగా.. గ్రేట్ బ్రో.. సినిమా కోసం చాలా కష్టపడుతున్నావు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
They Call Him OG: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Kurukshetra 2: ‘కురుక్షేత్ర’ పార్ట్ 2 ట్రైలర్