Mega 157: పాట చిత్రీకరణలో చిరు, నయన్
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:02 PM
మెగా స్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న అనిల్ రావిపూడి మూవీ మూడో షెడ్యూల్ జూలై 16న మొదలైంది. ఈ నెల 23 వరకూ ఇది జరుగబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ మూడో షెడ్యూల్ ను ప్రారంభించుకుంది. జూలై 16 నుండి కేరళలోని అలెప్పి పరిసర ప్రాంతంలో ఇది మొదలైంది. ఈ షెడ్యూల్ ఓ ప్రధానంగా చిరంజీవి, నయనతార (Nayantara) పై ఓ పాటను చిత్రీకరిస్తారు. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి కొరియోగ్రఫీ అందించిన భాను మాస్టర్ ఈ పాటకు వినూత్నరీతిలో నృత్యరీతులు సమకూర్చబోతున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు భీమ్స్ స్వరాలు సమకూర్చారు. మెగాభిమానులు కన్నులకింపుగా ఈపాట రూపుదిద్దుకోబోతోంది. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల దీన్ని నిర్మిస్తున్నారు. కేరళలో జరుగుతున్న మూడో షెడ్యూల్ జూలై 23 వరకూ కొనసాగుతుంది.
Also Read: Ghaati Movie: ఘాటీ.. మరో కొత్త డేట్ లాక్..
Also Read: War 2: నెలరోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం