Mega Heroes: ఒకే ఫ్రేమ్ లో మెగా హీరోస్.. ఒకరిని మించి ఒకరు ఉన్నారుగా

ABN , Publish Date - Aug 10 , 2025 | 02:15 PM

ఎంత ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అయినా ఒకే ఫ్రేమ్ లో అందరూ కనిపించడం చాలా అరుదు. అందులో మెగా హీరోస్ కనిపించడం అయితే మరీ రేర్. ఫంక్షన్స్, పండగలు తప్ప మెగా హీరోలు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడం చాలా కష్టం.

Mega Heroes

Mega Heroes: ఎంత ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అయినా ఒకే ఫ్రేమ్ లో అందరూ కనిపించడం చాలా అరుదు. అందులో మెగా హీరోస్ కనిపించడం అయితే మరీ రేర్. ఫంక్షన్స్, పండగలు తప్ప మెగా హీరోలు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో తప్ప ఇలా మెగా హీరోలు కలిసి కనిపించరు. తాజాగా అలాంటి అరుదైన ఫోటోను మెగా హీరోలు షేర్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), వరుణ్ తేజ్ (Varun Tej), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej).. ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.


మెగా హీరోలు ఏది మానినా వర్క్ అవుట్ మానరు అన్న విషయం అందరికీ తెల్సిందే.అందులోనూ ఈరోజు సండే కావడంతో.. ఈ ముగ్గురు కజిన్స్ ఉదయమే జిమ్ లో కసరత్తులు కలిసి చేస్తున్నట్లు కనిపించారు. ఇక ఈ ఫోటోను వరుణ్ తేజ్ షేర్ చేస్తూ.. వీకెండ్ లో టీమ్ తో సరదాగా గడపండి అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ఇక ఈ ఫొటోలో హైలైట్ అంటే రామ్ చరణ్ అనే చెప్పాలి. బీస్ట్ మోడ్ లో ముగ్గురు కండలు తిరిగిన దేహాలతో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ఇక ఈ ముగ్గురు మెగా హీరోలు వరుస సినిమాలతో బిజీగా మారారు. రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా మారాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. పెద్ది కోసమే రామ్ చరణ్ ఈ బీస్ట్ లుక్ ను మెయింటైన్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇంకోపక్క సాయి ధరమ్ తేజ్.. సంబురాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నాడు. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసమే తేజ్ ఈ రేంజ్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు.


ఇక వీరిద్దరితో పాటు వరుణ్ తేజ్ కూడా ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కొరియన్ హర్రర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ మూడు సినిమాలతో ఈ ముగ్గురు మెగా హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Vijay Devarakonda: విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు

Anshu: మ‌న్మ‌థుడు అన్షు.. దిమ్మ‌తిరిగే గ్లామ‌ర్ ట్రీట్‌

Updated Date - Aug 10 , 2025 | 02:16 PM