Vijay Devarakonda: విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:17 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది.

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. విజయ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతుంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ కష్టపడుతూనే ఉన్నాడు. కింగ్డమ్ లాంటి పరాజయం తరువాత కూడా కుర్ర హీరో ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతూనే వస్తున్నాడు. ఇప్పటికే విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ- విజయ్ దేవరకొండ కాంబోలో ఇప్పటికే కింగ్డమ్ సినిమా వచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబో మరోసారి రీపీట్ కానుందని తెలుస్తోంది. సితారలోనే విజయ్ మరో సినిమాను ఓకే చేశాడట. డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ అని టాక్ నడుస్తోంది. కాంబో కొత్తగా ఉంది కదా. అవును.. ఈమధ్యనే హరీష్ శంకర్.. ఒక మంచి కథను విజయ్ కు చెప్పడం, అతనికి కూడా నచ్చడంతో ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.


ప్రస్తుతం హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. తమిళ్ మూవీ తేరికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. దీని తరువాత హరీష్. విజయ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా అయినా కొట్టాడా ..? లేక ఇంకేదైనా హిట్ సినిమాకు రీమేక్ నా అనేది తెలియాల్సి ఉంది.

OTT: ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే

Aneet Padda: సైయారా.. వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా

Updated Date - Aug 10 , 2025 | 12:17 PM