Anshu: మన్మథుడు అన్షు.. దిమ్మతిరిగే గ్లామర్ ట్రీట్
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:58 PM
మన్మధుడు సినిమాలో పక్కింటి అమ్మాయిగా మెప్పించిన ఈ బ్యూటీ అన్షు ఇప్పుడు సోషల్ మీడియా స్క్రీన్‌పై గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
2002లో నాగార్జున (Nagarjuna) హీరోగా వచ్చిన మన్మధుడు (Manmadhudu) సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బ్యూటీ అన్షు (Anshu). అ ఒక్క సినిమాతో అప్పట్లో తన అందంతో యూత్‌ను కట్టి పడేసింది. ఆపై ఒకటి అరా తప్పితే పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా, సినిమాలకు దూరమై పాతికేళ్లైనా నేటికి ఆమెకి మంచి క్రేజ్ లాలనే ఉంటూ వచ్చింది.
ఇటీవల మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పెల్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వరుసగా గ్లామరస్ ఫోటోషూట్స్ ఫొటోలు వదులుతూ సినిమా లవర్స్ ను కలవర పాటుకు గురి చేస్తోంది.
ట్రెండీ అవుట్‌ఫిట్స్, ఎలిగెంట్ లుక్స్‌తో పోస్ట్ చేస్తున్న ఫోటోలు నెటిజన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై పక్కింటి అమ్మాయిగా మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు సోషల్ మీడియా స్క్రీన్‌పై గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
ఆమె తాజా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. అందం, ఆకర్షణ, క్లాస్ కాంబినేషన్‌గా కనిపిస్తున్న ఈ ఫోటోలు చూసి అభిమానులు ఖంగు తింటున్నారు.
ఈ భామ ఏంటి ఈ స్తాయిలో రచ్చ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాషన్ సెన్స్, కంఫిడెంట్ లుక్స్‌తో అన్షు రానున్న రోజుల్లో మరిన్ని సర్‌ప్రైజ్ ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్ ను దిమ్మ తిరిగేలా చేసేలా కనిపిస్తోంది.