Meesala Pilla Song Records: 13 రోజులు..  36 మిలియన్ల వ్యూస్‌..

ABN , Publish Date - Oct 27 , 2025 | 04:50 PM

‘మీసాల పిల్ల’ సాంగ్‌ ఓ రికార్డును సృష్టించింది. విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్‌తో వెల్లడించింది.


మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్‌ రావిపూడి 9Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ (mana Shankara Vara prasad Garu). సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ (meesala Pilla) పాటను విడుదల చేశారు. భీమ్స్‌ సంగీతంలో ఈ పాటను ఉదిత్‌ నారాయణ్‌, శ్వేతా మోహన్‌ ఆలపించారు. చాలాకాలం తర్వాత చిరు కోసం ఉదిత్‌ పాడిన పాట ఇది. ఇప్పుడు ఈ సాంగ్‌ ఓ రికార్డును సృష్టించింది. విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్‌తో వెల్లడించింది.

13 రోజుల నుంచి యూట్యూబ్‌లోట్రెండింగ్ లో టాప్‌ వన్‌లో ఉన్నట్లు, 36 మిలియన్ల వ్యూస్‌ వచ్చినట్లు  ప్రకటించింది. భార్యభర్తల మధ్య అలకలు, చిన్నచిన్న అల్లర్ల నేపథ్యంలో సాగే ఈ పాట ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అని నిర్మాణ సంస్థ ఎక్స్‌ వేదికగా తెలిపింది.  ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్‌లో వెంకటేశ్‌ కూడా జాయిన్‌ అయ్యారు. చిరు, వెంకీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.  

ALSO READ: SSS Motion Poster: టైం పది అయ్యింది... గ్లాసులు కడుక్కునే టైం అయ్యింది

The Girl Friend: నటించలేనన్న సందీప్ రెడ్డి వంగా..

Last Samurai Standing OTT: 300 మంది.. స‌మురాయ్‌లు త‌ల‌బ‌డితే! ఓటీటీకి.. క‌ళ్లు చెదిరే వెబ్ సిరీస్

GD Naidu: మరో బయోపిక్ లో మాధవన్...


Updated Date - Oct 27 , 2025 | 04:53 PM