Meena Sagar: ఆ హీరో హోటల్ కి వెళ్లాలంటే భయమేసేది..
ABN, Publish Date - Nov 08 , 2025 | 10:05 PM
స్టార్ హీరోయిన్ మీనా సాగర్ (Meena Sagar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Meena Sagar: స్టార్ హీరోయిన్ మీనా సాగర్ (Meena Sagar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక అన్నీ భాషల్లో చేసిన మీనా.. హిందీలో మాత్రం చేయలేదు. పర్దా హై పర్దా అనే సినిమా తప్ప మరో సినిమా చేయలేదు. ఎంతమంది స్టార్ హీరోలు హిందీలో చేయమని అడిగినా చేయలేదట మీనా. అయితే ఒక హీరో మాత్రం తనను పదే పదే తనపక్కన హీరోయిన్ గా చేయమని అడిగేవాడని కానీ అది తాను చేయలేకపోయాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
నేను తెలుగుతో పాటు మిగతా భాషల్లో బిజీగా ఉన్న సమయంలోనే హిందీ నుంచి అవకాశాలు వచ్చాయి. అక్కడ నేను చేయలేకపోయాను. అసలు ఇక్కడ ఇన్ని సినిమాలు చేయడానికే నాకు తీరిక దొరికేది కాదు. ఒక్కో సమయంలో తిండి, నిద్ర కూడా ఉండేది కాదు. ఒకేరోజు నాలుగు సినిమాలు చేసేదాన్ని. అలాంటి సమయంలో బాలీవుడ్ కూడా అంటే నావల్ల కాలేదు. అది కాక అప్పుడు అందరూ నన్ను భయపెట్టారు. బాలీవుడ్ లో షూటింగ్ కి ఎక్కువ టైమ్ పడుతుందని అక్కడ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాదని చెప్పేవారు. దీంతో అస్సలు అటువైపు చూడాలనుకూడ అనుకొనేదాన్ని కాదు.
ఇక బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేది. అప్పట్లో షూటింగ్స్ అన్నీ అక్కడే జరిగేవి. అందుకే స్టార్స్ అందరూ అక్కడే బస చేసేవారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ హోటల్ లోనే ఉండేదాన్ని. నేను వెళ్ళిన ప్రతిసారీ మిథున్ నా గది దగ్గరకు వచ్చి.. నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్ అని అడిగేవాడు. నాకేమీ డేట్స్ కుదిరేవి కావు. ఎప్పుడు ఆ హోటల్ కి వెళ్ళినా మిధున్ అలానే అడిగేవాడు. ఇక ఒకానొక సమయంలో ఆ హోటల్ కి వెళ్లాలంటే భయపడేదాన్ని. ఆ తరువాత ఆ హోటల్ లో రూమ్ బుక్ చేస్తుంటే వద్దని చెప్పేదాన్ని.. అంత పెద్ద స్టార్ హీరో అన్నీ సార్లు అడిగినా నో చెప్పినందుకు బాధపడ్డాను' అని చెప్పుకొచ్చింది.
Sanjeev Reddy: ఆ మార్పు తెచ్చేందుకు మా సినిమా మొదటి అడుగు అవుతుంది
Janhvi Kapoor: అందాలను ఆరబోయడమేనా.. ఏమైనా అభినయం చూపించేది ఉందా