Dear Students Teaser: నయన్ మరో కొత్త ప్రయోగం.. డియర్ స్టూడెంట్స్ టీజర్ అదిరింది
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:04 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తుంది. జవాన్ తరువాత ఆమె నుంచి వచ్చిన ఏ చిత్రం కూడా విజయాన్ని అందుకున్నది లేదు.
Dear Students Teaser: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తుంది. జవాన్ తరువాత ఆమె నుంచి వచ్చిన ఏ చిత్రం కూడా విజయాన్ని అందుకున్నది లేదు. కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా అమ్మడికి కలిసి రాలేదు. ఇక దీంతో చాలా సెలెక్టీవ్ గా సినిమాలు ఎంచుకుంటున్న నయన్ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157లో నటిస్తోంది. ఇది కాకుండా అమ్మడు తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేసింది. అదే డియర్ స్టూడెంట్స్.
నయనతార, నివిన్ పౌలీ జంటగా సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డియర్ స్టూడెంట్స్. మావెరిక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ - పౌలీ జూనియర్ పిక్చర్స్ - రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై వినీత్ జైన్, నివిన్ పౌలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
పోలీస్ గా నయన్ కనిపిస్తుండగా నివిన్ పౌలీ రెస్టారెంట్ ఓనర్ గా కనిపించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినోదాత్మకంగా సాగింది. మాట్లాడాలి కూర్చో అని నయన్ అనగా.. పర్సనల్ అనుకుంటా అంటూ నివిన్ పక్కన కూర్చోవడం.. పక్కనే ఎందుకు ఒళ్లో కూర్చో అని నయన్ అనడం నవ్వులు పూయిస్తుంది. ఇక వీరితో పాటు నలుగురు స్టూడెంట్స్ ను చూపించారు. స్టూడెంట్స్ కి నయన్ కి సంబంధం ఏంటి.. ? నివిన్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
NTR: ఏంటీ.. ఎన్టీఆర్ సీరియల్ లో కూడా నటించాడా.. అది కూడా ఆ పాత్రలో
Raj Kundra: స్వామీజీకి కిడ్నీ దానం.. ఆ కేసును కప్పి పుచ్చడానికే