NTR: ఏంటీ.. ఎన్టీఆర్ సీరియల్ లో కూడా నటించాడా.. అది కూడా ఆ పాత్రలో
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:27 AM
నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR). తాతకు తగ్గ మనవడుగా తనకంటూ ఒక సొంత గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే హీరోగా మరకముందే బాల నటుడిగా ఎన్టీఆర్ నటించిన విషయం కూడా విదితమే.
NTR: నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR). తాతకు తగ్గ మనవడుగా తనకంటూ ఒక సొంత గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే హీరోగా మరకముందే బాల నటుడిగా ఎన్టీఆర్ నటించిన విషయం కూడా విదితమే. బాలరామాయణంలో రాముడిగా ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ వారుండరు. అయితే ఇలా సినిమాలతో పాటు ఎన్టీఆర్ ఒక సీరియల్ లో కూడా నటించాడన్న విషయం తెలుసా.. ? ఏంటీ.. ఎన్టీఆర్ సీరియల్ లోనటించాడా.. ? ఇదెప్పుడు జరిగింది.. ? ఏ సీరియల్ లో నటించాడు అని ఆరాలు తీస్తున్నారా.. ? అయితే తెలుసుకుందాం రండి.
ఎన్టీఆర్.. బాల రామాయణం తరువాత ఈటీవీలో ప్రసారమయ్యే భక్త మార్కండేయ అనే సీరియల్ లో టైటిల్ రోల్ లో కనిపించాడు. భక్త మార్కండేయుడిగా ఎన్టీఆర్ నటించి మెప్పించాడు. అయితే ఈ సీరియల్ ఎక్కువ రోజులు ప్రసారం కాలేదు. కొన్ని ఎపిసోడ్స్ కు మాత్రమే పరిమితమయ్యిందని టాక్. మొదటి నుంచి కూడా పౌరాణిక పాత్రలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. ఇక చిన్నతనంలో ఎన్టీఆర్ ఎక్కువ ఇలాంటి పాత్రల్లోనే కనిపించాడు. బాలరామాయణంలో రాముడిగా.. భక్త మార్కండేయుడు సీరియల్ లో మార్కండేయుడిగా.. కనిపించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఎప్పుడో వచ్చిన ఈ సీరియల్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ మధ్యనే ఆయన నటించిన వార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, అవేమి వర్క్ అవుట్ అవ్వలేదని తెలుస్తోంది. ఇక వార్ 2 తరువాత ఎన్టీఆర్ ఫోకస్ అంతా డ్రాగన్ మీదనే పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోతెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతోనైనా ఎన్టీఆర్ భారీ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
Raj Kundra: స్వామీజీకి కిడ్నీ దానం.. ఆ కేసును కప్పి పుచ్చడానికే
Rashmika Mandanna: 7 ఏళ్ల గీత గోవిందం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా