Mass Jathara: ఏదేమైనా.. ధమాకాలో ఉన్నంత దమ్ము.. ఇందులో లేదురా
ABN, Publish Date - Aug 05 , 2025 | 04:28 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత రవితేజ నటిస్తున్న చిత్రాల్లో మాస్ జాతర (Mass Jathara) ఒకటి.
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత రవితేజ నటిస్తున్న చిత్రాల్లో మాస్ జాతర (Mass Jathara) ఒకటి. సామజవరగమనా లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ కథను ప్రేక్షకులకు అందించిన భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీలీల (Sreeleela) నటిస్తోంది.
ఇప్పటికే రవితేజ - శ్రీలీల కాంబోలో ధమాకా లాంటి భారీ హిట్ చిత్రం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇక మాస్ జాతర కోసం కూడా ఈ కాంబోనే రిపీట్ అవుతుందని తెలియడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొన్నటికి మొన్న మాస్ జాతర నుంచి రిలీజైన మొదటి సింగిల్ తూ మేరా లవర్ కూడా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఆగస్టు 27 న ఈ సినిమా రిలీజ్ అవుతుందని కొద్దిగా ఆలస్యంగా ప్రకటించడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ను రిలీజ్ చేశారు. ఓలే.. ఓలే.. ఓలే అంటూ సాగే గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ, మాస్ సాంగ్, శ్రీలీల అందం కలిపితే అది డెడ్లీ కాంబినేషన్ అన్న విషయం తెల్సిందే.ఇప్పటికే వీరి కాంబోను ధమాకాలో కూడా చూసి ఉన్నాం. అందులో ప్రతి సాంగ్ ఒక చార్ట్ బస్టర్ అనే చెప్పాలి. ముఖ్యంగా జింతాక్ జింతాక్ సాంగ్ కానీ, పల్సర్ బైక్ సాంగ్ కానీ, ఇప్పటికీ ఎక్కడో ఒకచోట మాస్ పార్టీలో వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ధమాకా సాంగ్స్ విన్నాకా మాస్ జాతర సాంగ్స్ కొద్దిగా తేలిపోయాయి అనే మాట వినిపిస్తుంది.
సాంగ్ మొత్తంలో ఎక్కడా మాస్ మహారాజా ఎనర్జీ కానీ, శ్రీలీల ఎనర్జీ కానీ తగ్గలేదు. నీ అమ్మా.. నీ అక్కా.. అంటూ వచ్చే లిరిక్స్ కూడా బాగానే ఆకట్టుకున్నా కూడా .. అంత ఊపు తెప్పించే మ్యూజిక్ ఇంకా భీమ్స్ ఇవ్వలేకపోయాడని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. ఇంకా ఈ సాంగ్ కు హై మ్యూజిక్ ఉంటె థియేటర్లోనే కాదు.. ప్రతి పార్టీలో ఇదే సాంగ్ వినిపించేదని, వినగా వినగా సాంగ్ ఏమైనా ఊపు తెప్పిస్తుందేమో చూడాలని కొందరు అంటున్నారు. ఇక ఇంకొంతమంది థియేటర్లో పూనకాలు ఖాయమని చెప్పుకొస్తున్నారు. భాస్కర్ యాదవ్ దాసరి రాసిన లిరిక్స్.. మధ్యలో ప్రాస.. భీమ్స్, రోహిణి సోర్రోట్ వాయిస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. జానీ మాస్టర్ కొరియోయోగ్రఫీ మరో ఎత్తు అని చెప్పొచ్చు. రవితేజ, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులకు థియేటర్లలో కుర్చీలు బద్దలు అవ్వడం ఖాయమని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Hrithik Roshan: ఆ ఫలితం నాకు తెలిసింది.. మీరూ ట్రై చేయండి..
Vishwambhara: అందమైన చందమామలా మెరిసిపోతున్న ఆషికా