Mass Jathara: ‘మాస్ జాతర’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..
ABN, Publish Date - Oct 25 , 2025 | 04:18 PM
రవితేజ (Ravi teja) హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ తర్వాత రవితేజ - శ్రీలీల కలిసి నటించిన చిత్రమిది.
రవితేజ (Ravi teja) హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటించిన చిత్రమిది. రవితేజ పోలీసు అధికారి పాత్రలో సందడి చేయనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ట్రైలర్‌ను అక్టోబరు 27న విడుదల చేయనున్నారు. అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది ఈ సినిమా.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. ‘మాస్, ఫన్ అండ్ యాక్షన్.. అన్నీ ఒక దానిలోనే! ఎంటర్‌టైన్‌మెంట్ మాస్ వేవ్‌ను థియేటర్స్‌లో ఆస్వాదించండి’ అని పేర్కొంది. సినిమా నిడివి 160 నిమిషాలుగా ఖరారు చేసినట్లు తెలిసింది. ప్రీమియర్స్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పర్మిషన్ కోసం చిత్ర బృందం ప్రయత్నాలు మొదలుపెట్టారు.