సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Vishnu: టాలీవుడ్ ఇండస్ట్రీ వాట్సాప్ గ్రూప్.. వారి వల్లే బయటకు వచ్చేశా 

ABN, Publish Date - Jun 18 , 2025 | 10:05 PM

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కన్నప్ప (Kannappa). ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ బాబు(Mohan Babu) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

Manchu Vishnu

Manchu Vishnu:  మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కన్నప్ప (Kannappa). ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ బాబు(Mohan Babu) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ సినిమాలో  ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ఇలా స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు విష్ణు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి పాజిటివ్ టాక్ అందుకోవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 


ఇక కన్నప్ప జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచిన మంచు విష్ణు అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ మధ్యనే కన్నప్ప సినిమాను వీక్షించిన  సూపర్ స్టార్ రజినీకాంత్ .. చాలా బావుందని రివ్యూ కూడా ఇచ్చాడు. ఇక తలైవానే రివ్యూ ఇవ్వడంతో అభిమానులు కన్నప్ప కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే  కన్నప్ప సినిమాను చాలామంది కేవలం ప్రభాస్ కోసమే చూడడానికి సిద్ధంగా ఉన్నారు. 


ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు తెలుగు ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లందరూ కలిసి పెట్టుకున్న ఒక వాట్సాప్ గ్రూప్ గురించి చెప్పుకొచ్చాడు. విష్ణు కన్నా ముందు ఈ గ్రూప్ గురించి చాలామంది హీరోలు మాట్లాడారు. ఇక హీరోలందరూ కలిసి ఇందులో చాట్ చేసుకుంటారట. ట్రైలర్స్, సాంగ్స్, జోక్స్  అన్ని షేర్ చేసుకుంటారట.  తమ సినిమాల గురించి మాత్రమే కాకుండా వేరే సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటారని తెలిపారు.  ఇక ఈ గ్రూప్ ను అల్లు అర్జున్, రానా క్రియేట్ చేయగా.. అందులో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కుర్ర హీరోలందరూ ఉంటారట. 


అయితే ఈ గ్రూప్ లో మంచు విష్ణును యాడ్ చేయగా.. ఆయన వెంటనే గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాడట. అలా బయటకు రావడానికి  కారణం ఏంటి అని యనకృ అడగ్గా మంచు విష్ణు మాట్లాడుతూ.. ' టాలీవుడ్ ఇండస్ట్రీ వాట్సాప్ గ్రూప్ ను బన్నీ, రానా స్టార్ట్ చేశారు. అందులో నన్ను కూడా యాడ్ చేశారు. నేను బయటకి వచ్చేసాను. ఎందుకంటే.. గ్రూప్ లో ఉంటే బాధ్యతగా ఉండాలి. లేదు అంటే కొద్దిగా మనల్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. బయటకు వచ్చి బన్నీకి డైరెక్ట్ గా కాల్ చేసి.. బ్రో.. నీకేదైనా అవసరం ఉంటే నా పర్సనల్ నెంబర్ కు మెసేజ్ చెయ్..  ఆ గ్రూప్ లో చాలామంది అమ్మాయిలు ఉంటారు. వారందరి ముందు మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గు  అని చెప్పాను.  అందులో చాలా జరుగుతాయి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Sekhar Kammula: కుబేర స్టోరీ ఇదే.. నాగార్జుననే తీసుకోవడానికి కారణం ఏంటంటే..? 

Updated Date - Jun 19 , 2025 | 09:49 AM