Sekhar Kammula: కుబేర స్టోరీ ఇదే.. నాగార్జుననే తీసుకోవడానికి కారణం ఏంటంటే..?
ABN , Publish Date - Jun 18 , 2025 | 09:24 PM
స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula).. లవ్ స్టోరీ (Love Story) లాంటి హిట్ తరువాత కుబేర (Kuberaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Sekhar Kammula: స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula).. లవ్ స్టోరీ (Love Story) లాంటి హిట్ తరువాత కుబేర (Kuberaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా తెరకెక్కిన కుబేర చిత్రంలో అక్కినేనిని నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రష్మిక (Rashmika) హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ హైప్ ను తీసుకొచ్చి పెట్టింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న శేఖర్ కమ్ముల వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు.
కుబేర తీయడానికి మోటివేషన్ ఏమిటి అన్న ప్రశ్నకు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. 'మోటివేషన్ అంటూ ఏం లేదు. కానీ, ఇదొక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం. అంటే బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. అది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. నెమ్మదిగా దాన్ని కథగా మార్చాను. తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనేది కుబేర స్టోరీ. ఈమధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ డెఫినెట్ గా చెప్పాలి. ఈ కథ ప్రజల్లో అవేర్నెస్ ని తీసుకొస్తుంది' అని చెప్పుకొచ్చాడు.
కుబేరలో నాగార్జునను మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటి ..? అన్న ప్రశ్నకు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ' కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు. ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనరిజమ్స్ తో క్యారెక్టర్ కి తగ్గట్టుగా చూపించాము. నాగార్జున గారు మనం, ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఆ పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ధనుష్, నాగార్జున ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Shilpa Shetty: స్టార్ హీరోయిన్ రెస్టారెంట్.. నెలకు రూ. 6 కోట్ల ఆదాయం