Kannappa Trailer: అద్భుతమైన విజువల్స్ తో కన్నప్ప ట్రైలర్.. హైలైట్ గా ప్రభాస్
ABN, Publish Date - Jun 14 , 2025 | 06:47 PM
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సినిమా కన్నప్ప(Kannappa).
Kannappa Trailer: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సినిమా కన్నప్ప(Kannappa). ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కాజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అనగానే సినిమాపై ఎక్కడలేని హైప్ వచ్చేసింది.
మంచు కుటుంబంపై ఉన్న నెగిటివిటీని పక్కన పెట్టి మరీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా కన్నప్ప ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. " దేవుడు లేడు.. దేవుడు రాడు" అని ఒక చిన్న కుర్రాడు.. రాయితో శివలింగాన్ని కొట్టడం.. ఆ రాయిని పరమశివుడు పట్టుకోవడంతో ట్రైలర్ మొదలయ్యింది.
Samantha: అన్నీ దాటిపోవాలి.. సమంత పోస్ట్ వైరల్
చిన్నతనం నుంచి దేవుడు లేడు అని నమ్మే కుర్రాడు తిన్నడు( మంచు విష్ణు). అయితే తిన్నడు ఉండే గూడెంలో శివుడిని మాత్రమే కొలుస్తారు. ఆ గూడెంలోనే వాయు లింగం ఉంటుంది. దానిని తీసుకెళ్లడానికి శత్రువులు పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఆ వాయు లింగాన్ని కాపాడడానికి తిన్నడు పూనుకుంటాడు. అయితే శివుడి మీద భక్తి లేని అతనిని ఊరి నుంచి పెద్దలు వెలివేస్తారు. అలా గూడెం నుంచి దూరమైన తిన్నడు.. పరమ శివుడికి భక్తుడు ఎలా అయ్యాడు.. ? రుద్ర(ప్రభాస్) ను శివుడు కిందకు ఎందుకు పంపాడు.. ? చివరికి ఆ వాయు లింగం ఏమైంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక ట్రైలర్ మొత్తం మంచి మంచి విజువల్స్ తో నింపేశారు. హై ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ - విష్ణు మధ్య ఫైట్ సినిమాకే హైలైట్ గా మారనుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ ది క్యామియో రోల్ అన్నారు కానీ, ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఎక్కువసేపే కనిపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ తరువాత కన్నప్పపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ మరింత ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో మంచుయు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.