Samantha: అన్నీ దాటిపోవాలి.. సమంత పోస్ట్ వైరల్ 

ABN , Publish Date - Jun 14 , 2025 | 05:14 PM

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెల్సిందే.

Samantha

Samantha: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెల్సిందే. శుభం(Subham) సినిమాతో శుభంగా నిర్మాతగా మారిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమ బ్యానర్ లో మంచి మంచి కథలను వింటున్న సామ్..  హీరోయిన్ గా ఒక సిరీస్ చేస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో విడిపోయాక..  బాలీవుడ్  డైరెక్టర్  రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో సామ్ రిలేషన్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

రాజ్ నిడిమోరు దర్శకత్వంలోనే సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2(The Family Man 2), సిటాడెల్(Citadel) సిరీస్ లు చేసింది.  ఇక అప్పటినుంచే వీరిమధ్య  పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది.  కొన్నేళ్లు సీక్రెట్ డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  సామ్ బ్యానర్ కి రాజ్ కూడా కో ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అయితే  ఇప్పటివరకు ఈ హీరోయిన్.. తన కొత్త రిలేషన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక సామ్ ఎక్కడ ఉంటే రాజ్ అక్కడే ఉంటున్నాడు.

 Anirudh Ravichander: సన్ రైజర్స్  జట్టు ఓనర్ కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి..  క్లారిటీ ఇచ్చిన టీమ్

 తాజాగా సమంత  అబుదాబీ  వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. గత వారం నుంచి ఆమె  ఎడారిలో సుందర ప్రదేశాల దగ్గర దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అద్భుతమైన క్యాప్షన్స్ ఇస్తూ వస్తుంది. తాజాగా  ఎడారిలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సామ్ అందమైన క్యాప్షన్  రాసుకొచ్చింది. ఏది శాశ్వతం కాదని, అన్ని దాటుకుపోవాలి.. కొత్త దరి వెతుక్కోవాలి అనే అర్ధం వచ్చేలా ఆమె ఒక మంచి కొటేషన్ ను రాసుకొచ్చింది.

 

 " ఏ అల మిగిలి ఉండదు, ఏ తుఫాను కూడా నిలిచి ఉండదు, అన్నీ దాటిపోవాలి, తర్వాత తమ దారిని వెతుక్కోవాలి" అంటూ చెప్పుకొచ్చింది. అయితే సామ్.. తన జీవితం గురించి మాట్లాడుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు.   రాజ్ తో రిలేషన్ ఆమెకు కొత్త దారి. ఆ దారిలోనే ఆమె నడుస్తుందని చెప్పుకొస్తుందా.. ? అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Updated Date - Jun 14 , 2025 | 05:33 PM