Manchu Vishnu: ఎట్టకేలకు హిట్ కొట్టిన మంచు విష్ణు
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:20 PM
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannappa).
Manchu Vishnu: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మంచు విష్ణు సాంగ్ పాడుకుంటున్నాడు అని అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannappa). మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. ఎన్నో ఏళ్ళ తరువాత మంచు విష్ణు ఒక మంచి విజయాన్ని అందుకున్నాడని చెప్పొచ్చు.
మొదటినుంచి కూడా కన్నప్పపై అభిమానులు భారీ అంచనాలన పెట్టుకున్నారు. కన్నప్ప సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రభాస్ లుక్ ను రివీల్ చేసేవరకు కొద్దిగా నెగిటివ్ టాక్ ఉంది కానీ, ఏరోజైతే ప్రభాస్ లుక్ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈరోజు రిలీజ్ అయ్యేవరకు కూడా డార్లింగ్ ఫ్యాన్స్.. ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులకు మంచి ఫలితం లభించింది. రుద్ర పాత్రలో ప్రభాస్ సినిమాకే హైలైట్ గా మారాడు. ఇక సినిమా మొత్తం స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఎవరెవరు ఎలా నటిస్తారో అని చాలామంది భయపడ్డారు కానీ, కన్నప్పలో నటించిన ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా నటించినట్లు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.
శివునిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ జంట బావుందని, తిన్నడి తండ్రిగా శరత్ కుమార్ తన బేస్ వాయిస్ తో మెప్పించినట్లు తెలుస్తోంది. ఇక నెమలిగా ప్రీతీ ముకుందన్ నటన అందరి మనసులను ఆకట్టుకుంటుందని టాక్. ఇక తిన్నడుగా మంచి విష్ణు జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బావుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. కథ పరంగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసినా.. ఇది విష్ణు కన్నప్ప అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక ఎట్టకేలకు మంచు విష్ణు ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
మంచు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విష్ణు.. ఢీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత అంతటి విజయాన్ని ఇప్పటివరకు విష్ణు అందుకున్నది లేదు. మధ్యలో దేనికైనా రెడీ లాంటి సినిమా వచ్చి హిట్ అందుకున్నా.. అది విష్ణు కెరీర్ లో గుర్తుండిపోయేంత హిట్ అని చెప్పలేం. మంచు విష్ణు అంటే టక్కున గుర్తొచ్చే సినిమాలు అంటే ఢీ.. ఇప్పుడు కన్నప్ప అని చెప్పొచ్చు. ఆ లెక్కన చూస్తే మంచు విష్ణు ఎన్నాళ్లకెన్నాళ్లకు ఒక మంచి హిట్ ను చూసాడు అని చెప్పాలి. కథాపరంగా నటీనటుల నటన పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కన్నప్ప.. కలక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Manchu Manoj Vs Kannappa: ఇలా చేస్తారని.. కలలో కూడా అనుకోలే! కన్నప్పపై.. మంచు మనోజ్ రివ్యూ