Manchu Manoj Vs Kannappa: ఇలా చేస్తార‌ని.. కలలో కూడా అనుకోలే! క‌న్న‌ప్ప‌పై.. మంచు మ‌నోజ్ రివ్యూ

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:42 PM

మంచు విష్ణు త‌న‌ ద‌శాబ్దాల క‌ల‌ల‌ను సాకారం చేస్తూ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి క‌న్న‌ప్ప చిత్రంపై మ‌నోజ్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

Manchu Manoj

మంచు విష్ణు (Manchu Vishnu) త‌న‌ ద‌శాబ్దాల క‌ల‌ల‌ను సాకారం చేస్తూ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది క‌న్న‌ప్ప (Kannappa). సినిమా విడుద‌లైన అన్ని ప్రాంతాల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ప్రసాద్ ఐమ్యాక్స్ థియేట‌ర్‌లో సినిమా చూసిన మంచు మ‌నోజ్ (Manoj Manchu) వీక్షించారు. సినిమా ముగిసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సినిమాపై త‌న అభిప్రాయం వెలిబుచ్చాడు.

కన్నప్ప సినిమా చాలా చాలా బాగుంద‌ని, ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెల్లింద‌ని, క్లైమాక్స్ లో ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదని, చాలా అద్భుతంగా చేశార‌ని అన్నారు. అంతేగాక సినిమాలో అందరూ చాలా బాగా చేశారని, నేను అనుకున్న దాని కంటే సినిమా వెయ్యి రెట్లు బాగుందంటూ మంచు మనోజ్ క‌న్న‌ప్ప సినిమాకు కితాబిచ్చారు. సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని, వాళ్లు పెట్టిన డ‌బ్బుకు వెయ్యింతలు లాభం రావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. అయితే సినిమా ఆరంభంలో మిస్స‌యిన ఐదు నిమిషాలు మిస్స‌య్యాన‌ని, రేపు ఉద‌యం మ‌రోసారి వ‌చ్చి చూస్తాన‌ని అన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 01:34 PM