Manchu Vishnu: కన్నప్పలో.. ప్రభాస్ పాత్ర నిడివి ఎంతంటే... అలా చేయక తప్పలేదు
ABN , Publish Date - May 26 , 2025 | 07:40 AM
మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం కన్నప్ప. తాజాగా ఈ మూవీ గురించి విష్ణు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మంచు విష్ణు (ManchuVishnu) కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం కన్నప్ప (Kannappa). తన సొంత బ్యానర్‌లో మంచు మోహన్ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. గత సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. ఆక్రమంలో ఇప్పటివరకు విడుదల చేసిన పాత్రలు లుక్స్, పాటలు, టీజర్లు అన్నీ సినిమాపై మంచి అంచనాలనే క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 27న ఆ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (AkshayKumar), మోహన్ లాల్ (Mohanlal), కాజల్ ఆగర్వాల్, మోహన్ బాబు, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు (Manchu Vishnu) ఇప్పటికే అమెరికా నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి అంతా తానొక్కడే అయి చూసుకుంటున్నారు. ఇంఉలో భాగంగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన విషయంలో కన్నప్ప సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఈ ముగ్గురి వళ్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని, సినిమాకు సైతం మార్కెట్ వచ్చిందని అన్నారు. ఇక సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని అందులో వార్ ఎపిసోడ్ 10 నిమిషాలు, మోహాన్‌లాల్ పాత్ర 15 నిమిషాలు అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ పాత్ర అయితే 30 నిమిషాలకు పైగానే ఉంటుందని, మోహన్ లాల్ పాత్ర షాక్ చేస్తుందన్నారు.
అయితే.. ప్రభాస్ (Prabhas) లైన్ వినకుండానే ఈ సినిమా చేశాడని.. షూటింగ్ జరుగుతూ పోతూ ఉంటే కథ వింటూ ప్రభాస్ ఇదేదో మాములుగా లేదంటూ ఆశ్చర్య పోయారని అన్నారు. నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచాడని అతనికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రభాస్ ఈ రోజు ఉన్న స్థాయికి ఈ సినిమాలో చేయాల్సిన అవసరం లేదని కేవలం నాన్న గారి మీద ఉన్న ప్రేమతో ఈ సినిమా చేశాడని అందుకే ఆ పాత్రను ఎక్కడా తగ్గించకుండా చూసుకున్నామని, పాత్ర నిడివి ఎక్కువగానే ఉన్నప్పటికీ సినిమా కోసం 30 నిమిషాలు వాడుకున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభాస్, మోహన్ బాబుల మధ్య వచ్చే వాగ్వాదం, ప్రభాస్, నా మధ్య వచ్చే సన్నివేశాలు గూస్‌బంప్స్ వచ్చేలా ఉంటాయన్నారు.