సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Vishnu: నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. ఆయన జీవితంలో నేను కర్ణుడు 

ABN, Publish Date - Jun 21 , 2025 | 10:18 PM

మంచు విష్ణు ( Manchu Vishnu) హీరోగా ముకేశ్ సింగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannappa). మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మించిన ఈ సినిమా  జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Manchu Vishnu

Manchu Vishnu: మంచు విష్ణు ( Manchu Vishnu) హీరోగా ముకేశ్ సింగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannappa). మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మించిన ఈ సినిమా  జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి స్టార్స్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా నేడు కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. 


ఇక ఈ వేడుకలో మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప కోసం పనిచేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. వినయ్ మరియు విజయ్  ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ను నమ్మి ఎప్పుడూ తన పక్కనే ఉన్నారని, 2017 లో మ్యూజిక్ డైరెక్టర్ స్టీవెన్ దేవసీ ని కలవడం జరిగిందని,  కన్నప్ప సినిమా ఎప్పుడు చేస్తానో తెలియదు.. చేసినప్పుడు మాత్రం మీరే చేయాలి.  నాకు సౌండింగ్ కొత్తగా ఉండాలి అని చెప్పినట్లు తెలిపాడు. శివ బాలాజీ.. అతను చేసిన సాయం మర్చిపోలేనిది. మోహన్ లాల్.. మహా నటుడు. అక్షయ్ కుమార్ కి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు. 


ఇక శరత్ కుమార్  తనకు తండ్రి లాంటివారని, తమిళ్ లో డిస్ట్రిబ్యూషన్ సమయంలో సమస్యలు వస్తే ఆయనే దగ్గరుండి సాల్వ్ చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా న్యూజిలాండ్ లో షూటింగ్ జరగడానికి కూడా శరత్ కుమార్ కారణమని చెప్పుకొచ్చాడు.  బ్రహ్మానందం గారు.. సినిమా మొదలైనప్పటి నుంచి  నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మోటివేషన్ చేస్తూనే ఉన్నారని మంచు విష్ణు తెలిపాడు. 


ఇక శివన్న ఒకసారి కన్నప్ప లాంటి సినిమా ఎందుకు చేయాలనుకున్నావ్ అని అడిగారు. ఏమో అన్నా నాకు తెలియదు.  50 ఏళ్ళ క్రితం అందరూ కన్నప్పను చూసారు. ఇప్పుడు మళ్లీ ప్రజలకు చూపించడానికి శివుడే అలా నాతో కన్నప్ప చేయించి ఉంటాడు. ఇదంతా శివేచ్చ.  లేకపోతే ఇంత పెద్ద సినిమా నేను ఎక్కడ చేయగలను అనుకున్నాను. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ఆర్ట్  డిపార్ట్ మెంట్ అందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు. 


'స్నేహితుల్లో రెండు రకాలు కృష్ణుడిలా .. కర్ణుడిలా. కృష్ణుడు నీ పక్కనే ఉంటా.. నీకు దారి చూపిస్తా, నీ వెంటనే ఉంటాను అంటాడు. కర్ణుడు, నువ్వేమైనా చెయ్, నీ వెనుక ఉంటా, ఏది జరిగినా నేను చూసుకుంటా అంటాడు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. ఆయన జీవితంలో నేను కర్ణుడు. అతను ఈ సినిమా చేసిన అవసరం లేదు. అతను కేవలం మా నాన్నగారి మీద ఉన్న ప్రేమ, గౌరవం కోసం చేశాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ ను మీరు స్టార్ గా ప్రేమించేదానికన్నా.. నేను ఎక్కువ ప్రేమించేది అతని మానవత్వం. ప్రభాస్ దగ్గరనుంచి ఈతరం నేర్చుకోవాలి.  కొంత డబ్బు వచ్చినా.. కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతారు. కానీ, ప్రభాస్  ఎంత పెద్ద స్టార్ అయినా కూడా  అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ప్రభాస్.. నీ జీవితంలో నేను కర్ణుడుని.. నీకేం  కావాలన్న నేను ఉన్నాను. నేను చేస్తాను. ఎప్పుడు నీ వెంటనే ఉంటాను'.


ఇక ఇదంతా జరిగింది అంటే అది నా దేవుడు మా నాన్న మోహన్ బాబు గారు. ఇంకొక ఆరురోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాను. ఇక నన్ను ఎప్పుడు మోటివేట్ చేసేది ప్రభుదేవా, బ్రహ్మానందం, ప్రభాస్. వారందరికీ నేను రుణపడి ఉన్నాను. సినిమా సక్సెస్ అయ్యాకా నేను ఇంకా మాట్లాడతాను అంటూ విష్ణు ముగించాడు. 

 Ghaati: సైలోరే.. లల్లాయ్ లల్లాయ్ లోరే..  మొదటి సింగిల్ తో సర్ప్రైజ్ ఇచ్చిన స్వీటీ 

Updated Date - Jun 21 , 2025 | 10:18 PM