Ghaati: సైలోరే.. లల్లాయ్ లల్లాయ్ లోరే..  మొదటి సింగిల్ తో సర్ప్రైజ్ ఇచ్చిన స్వీటీ 

ABN , Publish Date - Jun 21 , 2025 | 09:35 PM

లేడీ సూపర్ స్టార్ అనుష్క(Anushka)- క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కాంబోలో వేదం తరువాత వస్తున్న చిత్రం ఘాటీ(Ghaati). ఈ సినిమాలో విక్రమ్ ప్రభు ( Vikram Prabhu)హీరోగా నటిస్తున్నాడు. 

Ghaati

Ghaati: లేడీ సూపర్ స్టార్ అనుష్క(Anushka)- క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కాంబోలో వేదం తరువాత వస్తున్న చిత్రం ఘాటీ(Ghaati). ఈ సినిమాలో విక్రమ్ ప్రభు ( Vikram Prabhu)హీరోగా నటిస్తున్నాడు.  యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్  ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. జూలై 11 న ఘాటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి హడావిడి లేకుండా ఘాటీ నుంచి మొదటి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 


సైలోరే.. లల్లాయ్ లల్లాయ్ లోరే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనుష్క, విక్రమ్ ప్రభుల పెళ్లి  వేడుకలో ఊరంతా కలిసి వారిని ఆశీర్వదిస్తున్న సమయంలో వచ్చే సాంగ్ లా కనిపిస్తుంది. అనుష్క ముఖాన్ని రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. స్వీటీ ఇందులో డ్యాన్స్  కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇక  ఒక తండాలో జరిగే తంతులా ఆ లిరిక్స్ ఉన్నాయి. మధ్యలో ఇంగ్లీష్ వోకల్స్ కూడా వినిపించి చాలా కొత్తగా ఉంది సాంగ్. ఇక ఈ సాంగ్ కు డైరెక్టర్ క్రిష్ నే  లిరిక్స్ అందించడం విశేషం.  నాగవెల్లి విద్యాసాగర్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ను లిప్సికా భాష్యం, సాగర్ నాగవెల్లి తమ వాయిస్ తో మరింత హైప్ కు తీసుకెళ్లారు. 


ఇక ఈ సాంగ్ కు రాజు సుందరం కొరియోగ్రఫీ అందించడంతో పాటు సాంగ్ లో కొద్దిసేపు కనిపించినట్లు తెలుస్తోంది. మొదటి సాంగ్ తోనే సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు క్రిష్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో అనుష్క.. వేశ్యగా కనిపిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ పెళ్లి పాట ఆమె గతానికి సంబంధించిందని, భర్త మరణించడంతో ఆమె ఆ వృత్తిలోకి వెళ్లి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  జూలై 11 న ఘాటీ సినిమాతో స్వీటీ హిట్ ను అందుకుంటుందా.. ? లేదా.. ? అనేది చూడాలి. 

Manchu Mohan Babu: న్యూజిలాండ్ లో విష్ణు 7000 ఎకరాలు కొన్నాడు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Updated Date - Jun 21 , 2025 | 09:35 PM