Manchu Mohan Babu: కన్నప్ప అట్టర్ ప్లాప్.. నా కర్మ వాడు మోస్తున్నాడు
ABN, Publish Date - Jul 12 , 2025 | 03:17 PM
మంచు మోహన్ బాబు (Mohan Babu) ప్రస్తుతం ఎంతో సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. దానికి కారణం ఆయన కుమారుడు విష్ణు నటించిన కన్నప్ప మంచి విజయాన్ని అందుకోవడమే.
Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు (Mohan Babu) ప్రస్తుతం ఎంతో సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. దానికి కారణం ఆయన కుమారుడు విష్ణు నటించిన కన్నప్ప మంచి విజయాన్ని అందుకోవడమే. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప (Kannappa) గత నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చాలాకాలం తరువాత మంచు విష్ణు మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ (Prabhas) రుద్రగా కనిపించాడు. ఆయన వలనే ఈ సినిమా ఇంత పెద్దవిజయాన్ని అందుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్యామియోలు కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో మంచు విష్ణుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అసలు విష్ణులో ఇంత నటన దాగుంది అని ఎవరు ఊహించలేదని కామెంట్స్ కూడా చేశారు. కన్నప్ప భారీ విజయాన్నీ అందుకోవడంతో పాటు మంచి కలక్షన్స్ కూడా రాబట్టింది. అయితే మంచు కుటుంబం మీద ఉన్న నెగిటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా బావున్నా కూడా కొంతవరకు ట్రోలింగ్ కూడా నడిచింది. కన్నప్ప అట్టర్ ప్లాప్ అని, మంచు కుటుంబానికి అసలు సినిమాలు వేస్ట్ అని రకరకాలుగా ట్రోల్ చేశారు.
తాజాగా కన్నప్ప అట్టర్ ప్లాప్ ట్రోల్స్ పై మోహన్ బాబు స్పందించాడు. తాజాగా ఒక ఈవెంట్ కు వెళ్లిన ఆయనకు కన్నప్ప రిజల్ట్ గురించిన ప్రశ్న ఎదురయ్యింది. కన్నప్ప హిట్ అయినా కూడా కొందరు సినిమా అట్టర్ ప్లాప్ అని ట్రోల్ చేస్తున్నారు.. దానిపై మీ స్పందన ఏంటి అడగ్గా మోహన్ బాబు మాట్లాడుతూ.. 'విమర్శ - సద్విమర్శ.. ప్రకృతి - వికృతిలా రెండు ఉంటాయి. వేద శాస్త్రాలు తెలిసినటువంటి గొప్ప పండితుడు నాకో మాట చెప్పాడు. మోహన్ బాబు గారు.. ఇలా చూస్తున్నాను. మీరేమైనా ఇంతకుముందు జన్మలో కానీ, ఈ జన్మలో కానీ తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే ఆ కర్మనంతా వాళ్లు తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్లను ఆశీర్వదించండి అన్నాడు. అందుకే నేను వాళ్ల గురించి నేనేం మాట్లాడను. వాళ్లు బావుండాలి. వాళ్ల అమ్మానాన్నలు బావుండాలి అని కోరుకుంటాను' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Pooja Hegde: పూజా పాప.. ఐటెంసాంగ్సే కే సెట్ అవుతుందా