Pooja Hegde: పూజా పాప.. ఐటెంసాంగ్సే కే సెట్ అవుతుందా
ABN , Publish Date - Jul 12 , 2025 | 02:04 PM
ఇండస్ట్రీలో హిట్స్ వచ్చిన హీరోయిన్ ను ఒకలా చూస్తారు. ప్లాప్ లో ఉన్న హీరోయిన్స్ ను ఒకలా చూస్తారు. రెండు హిట్స్ పడగానే ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అని కితాబులిచ్చేస్తారు.
Pooja Hegde: ఇండస్ట్రీలో హిట్స్ వచ్చిన హీరోయిన్ ను ఒకలా చూస్తారు. ప్లాప్ లో ఉన్న హీరోయిన్స్ ను ఒకలా చూస్తారు. రెండు హిట్స్ పడగానే ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అని కితాబులిచ్చేస్తారు. రెండు ప్లాప్ లు వస్తే ఐరెన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. ఇక్కడ ఎప్పుడు ఎవరు అందలం ఎక్కుతారో.. ఎప్పుడు ఎవరు అధఃపాతాళానికి వెళ్తారో చెప్పడం కష్టం. తాజాగా అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde) ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ తో కొనసాగుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజా.. పాపం కొన్నేళ్లుగా ప్లాప్ ల పరంపరలో కొనసాగుతోంది.
ఏ ముహూర్తాన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేసిందో కానీ, అమ్మడి లక్ మొత్తం అయ్యగారు అఖిల్ కి ఇచ్చేసి ఆయన ప్లాప్ ను ఈమె తీసేసుకుంది. ఆ సినిమా తరువాత నుంచి ఇప్పటివరకు మచ్చుకు కూడా పూజా హిట్ కొట్టింది లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసినా ఎక్కడా కూడా విజయం అనే పదాన్ని అందుకోలేకపోయింది. పూజా పని అయ్యిపోయింది అనేవారు ఎక్కువ అయ్యారు. ఐరెన్ లెగ్ ముద్ర అమ్మడికి అవకాశాలను తీసుకురావడం కూడా మానేసింది. సరే ఒక ఏడాది వెకేషన్ అంటూ తిరిగి రెట్రోతో రీఎంట్రీ ఇచ్చినా అది కూడా ప్లాప్ లిస్ట్ లో చేరింది.
ప్రస్తుతం పూజా పరిస్థితి ఏంటి అంటే.. సినిమాలు లేకపోతేనే ఐటెంసాంగ్స్ లేవా ఏంటి అని చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు అంటే ఐటెంసాంగ్స్ చేయడానికి సపరేట్ నటీమణులు ఉండేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెంసాంగ్స్ కు సై అంటున్నారు. సమంత, తమన్నా, కాజల్, శ్రీలీల, అనుష్క.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ అందరూ కూడా ఏదో ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెంభామలుగా చిందేసిన వాళ్ళే. ఇక పూజా పాప కూడా తక్కువేం కాదు. ఇప్పటికీ వచ్చి అమ్మడు మూడు ఐటెంసాంగ్స్చేసింది. విశేషం ఏంటంటే ఆ మూడు సాంగ్స్ హిట్టే.
జిల్ జిల్ జిగేలు రాణి అంటూ రంగస్థలంలో చిట్టిబాబుతో చిందేసింది. ఇండస్ట్రీని ఊపేసిన పాటల్లో ఇప్పటికీ జిగేలు రాణి ఉంది. ఇక ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకొని లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అని ఎఫ్ 3 లో వెంకీ, వరుణ్ లతో స్టెప్స్ వేసి కేక పుట్టించింది. ఈ రెండు సాంగ్స్ కూడా అమ్మడికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు మోనికా అంటూ కూలీలో కుమ్మేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, ఆమీర్ ఖాన్, శృతి హాసన్ లాంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు.
ఇక సినిమాలో వారందరూ ఒక ఎత్తు అయితే పూజా పాప ఐటెంసాంగ్ మరో ఎత్తు అని చెప్పాలి. రెడ్ కలర్ డ్రెస్ లో బార్బీ బొమ్మలా పూజా పాప థైస్ అందాలను ఎరగా వేసి స్టెప్స్ వేస్తుంటే థియేటర్ లో ఏ కుర్రాడు అయినా సీట్ లో కూర్చుంటాడా.. ? కూలీ సినిమాకు పూజా సాంగ్ బాగా హైప్ తీసుకొచ్చింది. ఈ లెక్కన చూస్తే అమ్మడు సినిమాలు కంట ఐటెంసాంగ్స్ చేసుకుంటే బెటర్ అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇకనుంచి పూజా పాప ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితమవుతుందా.. ? అంటే ఏమో చెప్పలేం. హీరోయిన్ గా పరాజయాలు అందుకోవడం కన్నా.. ఐటెంభామగా విజయాలు అందుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి పూజా పాప.. కూలీ హిట్ కు ఎంతవరకు న్యాయం చేయగలదో చూడాలి.