Manchu Manoj: ఒక్క సినిమా.. ఏకంగా చిరుకే విలన్ గా మార్చింది
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:04 PM
టాలీవుడ్లో ఒకప్పుడు చిరంజీవి (Chiranjeevi), మోహన్ బాబు (Mohan Babu) స్క్రీన్ వార్ మామూలుగా ఉండేది కాదు.
Manchu Manoj: టాలీవుడ్లో ఒకప్పుడు చిరంజీవి (Chiranjeevi), మోహన్ బాబు (Mohan Babu) స్క్రీన్ వార్ మామూలుగా ఉండేది కాదు. ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి తన స్టైల్, గ్రేస్, డ్యాన్స్ థియేటర్లను ఊపేస్తే.. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, పంచ్ డైలాగులతో అభిమానులను అలరించే వారు. ఆ రోజుల్లో వీరి కాంబినేషన్ థియేటర్లను వార్ జోన్ గా మార్చేది. అంతేకాదు ఆ క్లాష్ తెర మీద మాస్ ఫీవర్ పెంచేది. అలాంటి ఈ కాంబోని చూసి అభిమానులు సైతం పోటాపోటీ నినాదాలతో హోరెత్తించే వారు. ఇప్పుడు అదే మెగా మంచు సెంటిమెంట్ రీ-జనరేట్ అయ్యేలా ఉంది. మళ్లీ కొణిదెల, మంచు వారి మధ్య పోటీ జరిగేలా కనిపిస్తోంది.
మంచు వారి అబ్బాయి... తాజాగా సోషియో-ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిరాయ్' లో మహాబీర్ లామా అలియాస్ బ్లాక్ స్వార్డ్ పాత్రతో మనోజ్ ప్రేక్షకుల మనసులు గెలిచాడు. అతని పవర్ ఫుల్ యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా తర్వాత మనోజ్ జాతకమే మారిపోతుందని చిత్ర పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కూడా గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం… మెగాస్టార్ చిరంజీవితో మనోజ్ ఓ భారీ ప్రాజెక్ట్లో విలన్ గా కనిపించనున్నాడన్న పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అప్పట్లో చిరు ,మోహన్ బాబు ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడు మనోజ్ రూపంలో 2.0 లా మళ్లీ తెరపై కనిపించేలా ఉంది.
యంగ్ డైరెక్టర్ బాబీ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్ లో చిరంజీవిని ఢీ కొనే పవర్ ఫుల్ రోల్ లో మనోజ్ కనిపించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'వాల్తేరు వీరయ్య'తో చిరు-బాబీ కాంబినేషన్ మాస్ హిట్ కొట్టింది. వీరి కాంబోలో మరో మూవీ రాబోతోంది. ఇందులో మనోజ్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఒకవైపు చిరంజీవి తన క్లాస్, మాస్, గ్రేస్ తో అభిమానులను అలరిస్తుంటే.. మరోవైపు మనోజ్ తన రఫ్ ఎనర్జీ, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ తో విలన్ గా ఆకట్టుకోబోతున్నాడన్నమాట.
ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు తండ్రితో తలపడిన మెగాస్టార్... ఇప్పుడు తనయుడితో వార్ కు సై అనటం సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' తో పాటు 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలు చేస్తున్నారు. అవి కంప్లీట్ కాగానే.. బాబీ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది. బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈమూవీలో మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడనే న్యూస్ కి సంబంధించి అధికార ప్రకటన త్వరలో రానుంది. ఏదిఏమైనా ఒక్క సినిమా.. మనోజ్ ని చిరుకు విలన్ గా మార్చింది. మరి చిరు-మోహన్ బాబు జోడీలా చిరు-మనోజ్ కూడా ఆడియన్స్ ను అలరిస్తారేమో చూడాలి.
Sunday Tv Movies: ఆదివారం, Sep21.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
OG Movie: ఓజీ నుంచి గీత వచ్చేసింది..