Manchu Lakshmi: షర్ట్ విప్పి ఎందుకు తిరుగుతున్నావని మహేష్ బాబును అడగగలరా
ABN, Publish Date - Sep 16 , 2025 | 04:35 PM
మంచు వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసం ఉంటోంది.
Manchu Lakshmi: మంచు వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసం ఉంటోంది. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంది. తాజాగా ఆమె నటించిన దక్ష సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో లక్ష్మీ హైదరాబాద్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అందులో భాగంగానే లక్ష్మీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఆడ, మగ అనే వ్యత్యాసానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
ముంబై కు వెళ్ళాకా మీ డ్రెస్సింగ్ లో మార్పు వచ్చింది. 50 ఏళ్లకు దగ్గరపడుతున్న మహిళ.. 12 ఏళ్ల కూతురుకు తల్లి.. ఇలా చిన్న చిన్న బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎవరు ఏం అనుకుంటారు అనేది మీకు ఉండదా.. ? అన్న ప్రశ్నకు లక్ష్మీ సదురు జర్నలిస్ట్ పై సీరియస్ అయ్యింది. ఎంతధైర్యం ఉంటే నన్ను ఆ ప్రశ్న అడుగుతారు అంటూఫైర్ అయ్యింది. ' ఈ ప్రశ్న ఒక మగాడిని అడుగుతారా .. ? మహేష్ బాబు నీకు 50 ఏళ్లు వచ్చాయి.. షర్ట్ విప్పి ఎందుకు తిరుగుతున్నావని అడగగలరా..? మరి ఒక ఆడపిల్లను ఎలా అడుగుతున్నారు.
ఇలా మీరు అడిగే ప్రశ్నల్నే జనాలు చూసి నేర్చుకుంటున్నారు. జర్నలిస్ట్ గా మీరేం ప్రశ్నలు అడగాలి అంటే.. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది .. ఇంకా పైకి ఎగరండి. మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా జీవించు లక్ష్మీ అని చెప్పాలి. కానీ, మీరు హద్దులు గీస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఆడవారిని అడుగుతున్నారు అంటే.. మీరు అప్పటికే వారిని ఆపేస్తున్నారని అర్ధం. మన టాలీవుడ్ లోనే సినిమాలు చేసే ఒక సూపర్ స్టార్ భార్య విడాకులు తీసుకున్నాక సినిమాలు చేయలేకపోతోంది. ఎవరు ఆమెతో సినిమా తీయాలన్న మీ భర్త తరుపువారు ఏమంటారో అనివారు ఛాన్స్ లు ఇవ్వడం లేదని చెప్తుంది.
అలాగే పిల్లలు ఉన్న నటీమణులు.. వాళ్లు పెద్దవాళ్ళు అయ్యాక సినిమాల్లో చేస్తాం అని అంటున్నారు. ఇదే మాట మగవారు ఎందుకు చెప్పరు. నాకు పిల్లలు ఉన్నారు. వారిని చూసుకోవాలి. వారు పెద్దయ్యాక నేను సినిమాలు చేస్తాను అని ఎందుకు చెప్పడం లేదు. విడాకులు అయ్యాకా మగవారికి ఏ మార్పు లేకుండా జీవితం నడుస్తుందేమో కానీ, ఆడవారికి అలా కాదు. పెళ్లి అయ్యాక, తల్లి అయ్యాక, అత్తగారు, మామగారు, కుటుంబం అని చాలా ఉంటాయి. వాటన్నింటి బాధ్యత మాపైనే ఉంటుంది కానీ, ఒక ఫ్రీడమ్ అనేది ఎక్కడా ఎవరు మాకు చూపించరు. దాన్నీ మేమే వెతుక్కోవాలి. నాకు ఆ ఫ్రీడమ్ నాకు నచ్చిన ఫుడ్ లో ఉంటుంది.. నాకు నచ్చిన బట్టల్లో ఉంటుంది. నేను అనుకున్నది మాట్లాడగలిగే దాంట్లో ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Kishkindhapuri: కిష్కింధపురికి మెగా సపోర్ట్..
OG: ఇదెక్కడి.. మాస్ బ్యాటింగ్‌రా మామ! ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమ్యాక్స్..నిమిషాల్లో హౌస్‌ఫుల్!