Kishkindhapuri: కిష్కింధపురికి మెగా సపోర్ట్..
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:20 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellammkonda Sai Srinivas) గత కొన్నేళ్లుగా విజయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. అయితే చాలా గ్యాప్ తరువాత బెల్లంకొండ..కిష్కింధపురి(Kishkindhapuri) సినిమాతో ఒక డీసెంట్ విజయాన్ని అందుకున్నాడు.
Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellammkonda Sai Srinivas) గత కొన్నేళ్లుగా విజయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. అయితే చాలా గ్యాప్ తరువాత బెల్లంకొండ..కిష్కింధపురి(Kishkindhapuri) సినిమాతో ఒక డీసెంట్ విజయాన్ని అందుకున్నాడు. కౌశిక్ పెగలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఉన్నకొద్దీ పాజిటివ్ టాక్ తో మంచి విజయాన్ని అందుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. క్లైమాక్స్ లో అమ్మడు భయపెట్టేసింది అని చెప్పొచ్చు. ఇక కొత్త లోకలో పోలీస్ గా అలరించిన శాండీ.. ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు.
ఇక రోజు రోజుకు ఈ సినిమా కలక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. నిన్న సోమవారం కూడా మంచిగా హౌస్ ఫుల్ అయ్యి షాక్ ఇచ్చింది. దీంతో పాటు ఈ సినిమాకు సెలబ్రిటీలు సైతం సపోర్ట్ గా నిలబడుతున్నారు. తాజాగా మెగా సపోర్ట్ కూడా కిష్కింధపురికి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను వీక్షించి తనదైన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు. ' నమస్తే.. నా రాబోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు నిర్మిస్తున్న నిర్మాత సాహు గారపాటి గారు మరో చిత్రం కిష్కింధపురి. అది రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఆ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారనిపించింది. అందుకుగాను ఆ చిత్రంలో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్ కు దర్శకనిర్మాతలకు నా అభినందనలు.
సాధారణంగా హార్రర్ సినిమాలు అంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది. కానీ, ఇందులో హర్రర్ తో పాటు ఒక మంచి సైకలాజికల్ పాయింట్ ను కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. అంటే శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం అని చెప్పడం, అలాగే మనిషికున్న బాధలు, కష్టాలు పక్కన వాళ్లకు చెప్పుకోకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే వచ్చే పరిణామాలు చాలా సమర్థవంతంగా చిత్రీకరించాడు డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి.
ఇక ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఒక మంచి విజయాన్ని దక్కించుకుంది. టోటల్ గా మన కిష్కింధపురి టీమ్ మొత్తానికి ఒక మంచి విజయాన్ని అందించిన ఏస్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి సినిమాను థియేటర్ కు వెళ్లి చూడండి' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Prabhas, Prashanth Varma: ప్రభాస్, ప్రశాంత్ వర్మ.. కాంబినేషన్ రెడీ
Glimpse Released: ప్రేమకు నమస్కారం అంటున్న షణ్ముఖ్