సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Lakshmi Prasanna: నా ఇంటి బాధ.. బయటవాళ్ళకి చెప్పాల్సిన పనిలేదు

ABN, Publish Date - Nov 27 , 2025 | 12:33 PM

మంచు లక్ష్మీప్రసన్న (Manchu Lakshmi) తాజాగా ఇచ్చిన ఓ పాడ్‌క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

మంచు లక్ష్మీప్రసన్న (Manchu Lakshmi) తాజాగా ఇచ్చిన ఓ పాడ్‌క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన ఇంట్లో వివాదాల గురించి (Manchu Family Issues) మాట్లాడారు. కుటుంబంలో ఇలాంటి గొడవలు వస్తాయని ఊహించలేదని అన్నారు. సినిమా ప్రచారాలో భాగంగా మాత్రమే ఇంటర్వూలు ఇవ్వడం ఇష్టమని తెలిపారు. ‘దేవుడు నాకు కనిపించి ఒక వరం కోరుకోమంటే.. నా కుటుంబమంతా మళ్లీ కలిసిపోవాలని మొక్కుతాను. ఇంతకుముందు ఎలాగైతే కలిసిమెలసి ఆనందంగా ఉన్నామో అలాగే ఉండాలని భగవంతుణ్ణి అడుగుతాను. అన్ని కుటుంబాల్లో గొడవలు ఉంటాయి. కానీ, ఎన్ని గొడవలు వచ్చినా చివరకు అందరూ ఒక్కటవ్వాలి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే.. జీవితాంతం కలవకూడదు అనుకుంటారు. కానీ, మనకు చివర వరకూ మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలి. కానీ మనుషుల మధ్య దూరం పెంచకూడదు. అది చెప్పలేని బాధను కలిగిస్తుంది.

నేను కొంతకాలంగా ముంబైలో ఉంటున్నా. అయితే ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి తెలిసి కూడా బాధ పడలేదని కొందరు వార్తలు రాశారు. కానీ ఆ సమయంలో నేను ఎంతగా బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. మా ఇంట్లో జరిగిన ఇష్యూలపై నేను మాట్లాడలేదు కాబట్టి ఇష్టమొచ్చినట్లు రాసేశారు. అసలు వాటి గురించి నేను స్పందించాలనుకోలేదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి వివాదాలను వస్తాయని అనుకోలేదు. ఇవన్నీ చూసి నేనే షాక్‌ అయ్యా. నా కుటుంబం గురించి నేను ఏమనుకుంటున్నానో ఆ వివాదాల వల్ల ఎంత బాధపడ్డానో బయటవాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకున్నాను’ అని లక్ష్మీప్రసన్న అన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 02:19 PM