Sanjay Dutt: పరులసొమ్ము పాములాంటిది.. రూ. 72 కోట్ల ఆస్తి తిరిగిచ్చేసిన స్టార్ హీరో
ABN , Publish Date - Jul 28 , 2025 | 07:22 PM
ఈ సమాజంలో క్రైమ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం డబ్బు. ఎదుటివారిని మోసం చేసి డబ్బు గుంజే మనుషులు ఉన్న ఈ లోకంలో ప్రేమతో కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా కూడా వద్దు అని సున్నితంగా తిరస్కరించాడు ఒక స్టార్ హీరో.
Sanjay Dutt: ఈ సమాజంలో క్రైమ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం డబ్బు. ఎదుటివారిని మోసం చేసి డబ్బు గుంజే మనుషులు ఉన్న ఈ లోకంలో ప్రేమతో కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా కూడా వద్దు అని సున్నితంగా తిరస్కరించాడు ఒక స్టార్ హీరో. ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా రూ. 72 కోట్ల ఆస్తిని వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్( Sanjay Dutt).
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో హీరోగా ఒక వెలుగు వెలిగిన సంజయ్ దత్ ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా రీఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ దత్.. తెలుగులో ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. సంజయ్ దత్ కు గతంలో ఒక అభిమాని తన మొత్తం ఆస్తిని రాసిచ్చిన విషయం తెల్సిందే.
2018 లో నిషా పాటిల్ అనే మహిళ.. సంజయ్ దత్ మీద ఉన్న అభిమానంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన పేరు మీద ఉన్న ఎస్టేట్ ను సంజయ్ దత్ కు రాసి ఇచ్చింది. తాను మరణించాక.. ఆ ఆస్తులను సంజయ్ దత్ కు అప్పజెప్పాలని బ్యాంకువారిని కోరింది. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒక అభిమాని ఇలా చేయడం ఏంటి అని చాలామంది ట్రోల్ కూడా చేశారు. ఇక ఈ ఘటనపై సంజయ్ నోరు విప్పాడు.
ఒక ఇంటర్వ్యూలో సంజయ్ మాట్లాడుతూ.. ' నిషా పాటిల్ ఆస్తిని ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చేశాను. పరులసొమ్ము పాములాంటింది.. ఆ ఆస్తి ఆమె కుటుంబం తీసుకుంది' అని చెప్పుకొచ్చాడు. దీంతో సంజయ్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఆస్తి వారి కుటుంబానికే చెందాలి. మంచి పని చేశావ్ సంజయ్ దత్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.