Malavika Mohanan: ఆయనతో నా డ్రీమ్‌.. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌..

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:55 PM

మాళవికతో ఓ అభిమాని పెళ్లి గురించి ప్రస్తావించాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని ఆ అభిమాని సరదాగా ప్రశ్నించగా.. తనకు దెయ్యాలంటే భయమని మాళవిక రిప్లై ఇచ్చారు.

మళవికా మోహనన్‌ (Malavika Mohanan) సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు ASK ME  అంటూ అభిమానులతో చాట్‌ చేస్తుంటారు. తాజాగా ఆమె రెండు సినిమాల షూటింగ్‌ పూర్తి చేసి ప్రమోషన్స్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఎక్స్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో పని చేయాలనుందనే కోరికను బయటపెట్టింది. రజనీకాంత్‌తో నటించిన పేట తన కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు.


Malvika.jpg

ఈ క్రమంలోనే ఓ అభిమాని పెళ్లి గురించి ప్రస్తావించాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని ఆ అభిమాని సరదాగా ప్రశ్నించగా.. తనకు దెయ్యాలంటే భయమని మాళవిక రిప్లై ఇచ్చారు. అలా అనడానికి కారణం ఏంటంటే.. ఆ అభిమాని ఎక్స్‌ అకౌంట్‌ పేరు ‘ఘోస్ట్‌’ (ghost)) అని ఉంది. అందుకే ఆమె అలా సమాధానమిచ్చింది. ఇంకా ఆమె ది రాజా సాబ్‌ చిత్రం గురించి మాట్లాడింది. ఈ చిత్రంలో డిపరెంట్‌గా నా క్యారెక్టర్‌ ఉంటుంది. గ్లామర్‌గానూ ఉంటుంది. ఇందులో నా నుంచి మంచి మాస్‌ సాంగ్‌ ఆశించవచ్చు. త్వరలోనే ప్రమోషన్స్‌లో పాల్గొంటా’’ అని అన్నారు. మోహన్‌లాల్‌తో కలిసి నటించిన ‘హృదయపూర్వం’ గురించి చెబుతూ 'మోహన్‌లాల్‌ సినిమాలు చూస్తూ పెరిగిన నేను.. ఆయనతోనే కలిసి నటించడం ఆనందంగా ఉంది ' అని  చెప్పారు. వేరే రంగాన్ని ఎంచుకోవలసి వస్తే వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీని ఎంచుకుంటానన్నారు మాళవిక.

'ది రాజా సాబ్' టీజర్ సూపర్  రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. "రాజా సాబ్" టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు  తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు  మాళవిక చెప్పింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని పేర్కొంది. మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ALSO READ:


Vishwambhara: చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

Siva Karthikeyan: పరాశక్తి తర్వాత ఆ సినిమానే...

SSMB29: మహేశ్‌ సినిమా... ఎంతైనా తగ్గేదేలే..


Updated Date - Jun 19 , 2025 | 02:35 PM