Siva Karthikeyan: పరాశక్తి తర్వాత ఆ సినిమానే...

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:37 PM

అమరన్ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ ఇప్పుడు 'మదరాసి సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత పరాశక్తి పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే శివ కార్తికేయన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) మార్కెట్ 'అమరన్' (Amaran) మూవీ తర్వాత అమాంతంగా పెరిగిపోయింది. అంతకు ముందు కూడా అతని కెరీర్ లో వరుస విజయాలు ఉన్నా... 'అమరన్' మూవీతో జాతీయ స్థాయిలో శివ కార్తికేయన్ గుర్తింపు తెచ్చుకున్నాడు.


ప్రస్తుతం శివ కార్తికేయన్ కిట్ లో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కిస్తున్న 'మదరాసి' (Madarasi). ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. దీనితో పాటే శివకార్తికేయన్ దర్శకురాలి సుధా కొంగర తెరకెక్కించబోతున్న 'పరాశక్తి' (Parasakthi) మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలను జాతీయ స్థాయిలోనూ విడుదల చేయడానికి మేకర్స్ భావిస్తున్నారు. అయితే 'పరాశక్తి' షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే శివ కార్తికేయన్ ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


తమిళ రొమాంటిక్ కామెడీ మూవీతో వినాయక్ చంద్రశేఖరన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మణికందన్, మీతా రఘునాథ్‌, రమేశ్ తిలక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 2023 మే నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా దర్శకుడితో శివ కార్తికేయన్ ఓ ఫాదర్ సెంటిమెంట్ మూవీకి అంగీకారం తెలిపాడట. ఇందులో తండ్రి పాత్రకు మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నారని తెలిసింది. ఒక్కసారి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే, ఆగస్ట్ లో మూవీని పట్టాలెక్కిస్తారట. ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 'పరాశక్తి' శివ కార్తికేయన్ కు 25వ సినిమా కాగా... ఇది 26వ చిత్రం.

Also Read: Aap Jaisa Koi: ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే...

Also Read: SSMB29: మహేశ్‌ సినిమా... ఎంతైనా తగ్గేదేలే..

Updated Date - Jun 19 , 2025 | 01:37 PM