Sobhita Akkineni: ఆధ్యాత్మిక యాత్రలో అక్కినేని కోడలు..

ABN , Publish Date - Aug 08 , 2025 | 02:55 PM

అక్కినేని కొత్త కోడలు శోభితా (Sobhita) ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో విహరిస్తోంది. నాగ చైతన్య (Naga Chaitanya)ను వివాహమాడాకా అక్కినేని ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

Sobhita Akkineni

Sobhita Akkineni: అక్కినేని కొత్త కోడలు శోభితా (Sobhita) ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో విహరిస్తోంది. నాగ చైతన్య (Naga Chaitanya)ను వివాహమాడాకా అక్కినేని ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. చైతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతూ మిగిలిన సమయాన్ని కుటుంబం కోసమే కేటాయిస్తుంది. పెళ్లి తరువాత శోభితా ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. అప్పుడప్పుడు యాడ్స్ లో కనిపిస్తూ కనువిందు చేస్తున్న అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. అయితే చైతో లేకపోతే సింగిల్ గా తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.


తాజాగా శోభితా.. తమిళనాడు వెకేషన్ కు వెళ్ళింది. అంటే అది వెకేషన్ అని కాదు కానీ, ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్లి.. ఎంచక్కా.. చర్చ్, మసీద్ లను సందర్శించి వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. గత కొన్నిరోజులుగా ఆమె తిరిగిన ప్రదేశాలతో పాటు.. తనకు అనిపించిన భావాలను కూడా కోట్స్ రూపంలో షేర్ చేసింది. ఇక తమిళనాడులో జరిగిన తన ఫ్రెండ్ అనిత పెళ్లి వేడుకలో శోభితా ఎంతో అందంగా కనిపించింది. తెలుగింటి ఆడపడుచులా పట్టుచీర, మెడలో నాంతాడు.. ముక్కుకు ముక్కెర ధరించి అచ్చతెలుగు ఆడపడుచులా దర్శనమిచ్చింది.


పెళ్లి తరువాత నాగూర్ దర్గాకు, వేళాంగిణి చర్చ్ కు కూడా వెళ్లి దర్శనం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫోటోలను కూడా పంచుకుంది. ఇటీవల జరిగినవి అనే క్యాప్షన్ తో పాటు.. మన దగ్గరకు వచ్చినదానిని తోసివేయకు.. మననుంచి వెళ్ళిపోయినా దాని గురించి దుఃఖించకు అనే కోట్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. శోభితా ఫోటోలు చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పెళ్లి తరువాత శోభితా సినిమాలు చేస్తుందా.. ? లేదా అనే అనుమానం ఇంకా అభిమానుల్లో ఉంది. మరి ముందు ముందు అమ్మడు ఏదైనా సినిమాను ప్రకటిస్తుందా .. ? లేదా.. ? చూడాలి.

Sangeetha: భర్తతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన సంగీత

Nishaanchi: అనురాగ్ క‌శ్య‌ప్ కొత్త సినిమా.. టీజ‌ర్ ఇంత బోల్డ్‌గా ఉందేంటి

Updated Date - Aug 08 , 2025 | 02:55 PM