Kuberaa: వరుసగా నాలుగోసారి వంద కోట్ల క్లబ్ లో ధనుష్..
ABN, Publish Date - Jun 25 , 2025 | 09:31 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్నా(Rashmika Mandanna) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 20 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
Kuberaa: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్నా(Rashmika Mandanna) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 20 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ధనవంతుల ప్రపంచానికి, పేదవాడి ప్రపంచానికి ముడిపెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ధనుష్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమా మొత్తం ధనుష్ నట విశ్వరూపం చూపించాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
ఇక తాజాగా కుబేర ఐదు రోజుల్లో వంద కోట్లను రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఎట్టకేలకు ఈ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాగార్జున మొట్ట మొదటి వంద కోట్ల సినిమా కుబేర కావడం విశేషం. ఇక ధనుష్ కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన నాలుగవ సినిమా కుబేర. కరోనా తరువాత నుంచి ధనుష్ చేసిన సినిమాలన్నీ వంద కోట్లు రాబట్టాయి. తిరు, సార్, రాయన్.. ఇప్పుడు కుబేర. ఈ నాలుగింటిలో రెండు తెలుగు సినిమాలు కావడం విశేషం.
కుబేర కథ విషయానికొస్తే.. నీరజ్ మిత్ర (జిమ్ సర్బ్) ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అనిపించుకోవడానికి ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ సాగర్ ని మొదలుపెడతాడు. దానికి ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అంత డబ్బును ఒకేలా కాకుండా కొంత బ్లాక్, కొంత వైట్ లో ఇవ్వాలని మంత్రులు చెప్పడంతో.. దానికోసం నమ్మకస్తూడైన ఒక వ్యక్తి కావాల్సివస్తుంది. తండ్రి సలహాతో జైల్లో ఉన్న దీపక్( నాగార్జున) కు ఆ పనిని అప్పగిస్తాడు నీరజ్. నిజాయితీగా పనిచేసినా డబ్బు పవర్ ఉంటేనే తప్ప ఇక్కడ బతకలేమని తెలుసుకున్న దీపక్.. నీరజ్ చెప్పినట్లు చేస్తాడు. ఆ పనికోసం నలుగురు బిచ్చగాళ్ళు కావాల్సివస్తుంది. అలా దీపక్.. దేవా(ధనుష్) ను తీసుకొస్తాడు. అయితే పని మొత్తం పూర్తవుతుంది అన్న సమయంలో దేవా కనిపించకుండా పోతాడు. అసలు దీపక్ పూర్తిచేయాల్సిన పని ఏంటి.. ? దేవా ఎందుకు పారిపోతాడు.. ? దేవాకు పరిచయమైన పరిచయమైన సమీరా (రష్మిక ) ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఐదురోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Lenin: రెండోసారి శ్రీలీల లక్ ను లాగేసిన భాగ్యశ్రీ..