Rashmika Mandanna: అయ్యా.. అమ్మడిని కొట్టేవారు టాలీవుడ్ లోనే లేరా
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:24 PM
ఇండస్ట్రీ అనేది ఒక చదరంగం. ఇక్కడ ఎప్పటికప్పుడు పావులు కదులుతూనే ఉన్నాయి. కింగ్ అయినా.. క్వీన్ అయినా ఎక్కువ రోజులు అదే స్థానంలో ఉండరు.
Rashmika Mandanna: ఇండస్ట్రీ అనేది ఒక చదరంగం. ఇక్కడ ఎప్పటికప్పుడు పావులు కదులుతూనే ఉన్నాయి. కింగ్ అయినా.. క్వీన్ అయినా ఎక్కువ రోజులు అదే స్థానంలో ఉండరు. ఎవరి అదృష్టం బావుంటే వారు ఆ స్థానాలకు వెళ్తారు. ఇక్కడ ఎప్పుడూ నంబర్ గేమ్స్ సాగుతూనే ఉంటాయి... ప్రస్తుతం తెలుగు సినిమారంగంలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. ఒకప్పుడు టాలీవుడ్ ఎలా ఉండేది అంటే.. టాప్ హీరోయిన్స్ ఒకపక్క ఉంటే.. కొత్త హీరోయిన్స్ అందరూ ఒక పక్క ఉండేవారు.
అనుష్క, పూజా హెగ్డే, రశ్మిక, సమంత, శ్రుతిహాసన్, కాజల్, త్రిష, తమన్నా.. ఇలా ప్రతి ఒక్కరు స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ బిజీగా ఉండేవారు. ఇందులో నెంబర్ వన్ గా అనుష్క ఉండేది. ఆ తరువాత శ్రుతి హాసన్.. సమంత, కాజల్.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్కరు ఉండేవారు. కానీ, మిగతావాళ్ళు కూడా నెంబర్ వన్ పొజిషన్ కి తగ్గట్టే విజయాలను అందుకొని గట్టి పోటీ ఇచ్చేవారు. ఇప్పుడు ఇండస్ట్రీ అలా లేదు. వీరందరూ సీనియర్ హీరోయిన్స్ అయిపోయారు. కొందరు సినిమాలు చేయడం ఆపేశారు. ఇంకొందరు పరాజయాల పరంపరను కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది మాత్రం రశ్మికనే.
రశ్మిక నటించిన తెలుగు చిత్రాల ఘనవిజయాలు. ఆమె అందుకుంటున్న పారితోషికం, ఉత్తరాదిన సైతం తనదైన బాణీ పలికిస్తోన్న వైన, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే రశ్మిక కాక వేరెవ్వరూ లేరని ఇట్టే తెలిసిపోతుంది... టాలీవుడ్ టాప్ హీరోయిన్ అంటే రశ్మికనే అని అందరూ అంగీకరిస్తున్నారు. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర.. ఇలా అమ్మడు నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్. తెలుగు, హిందీ భాషల్లో మకుటం లేని మహారాణిగా మారింది రశ్మిక. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోకుండా.. తన కెరీర్ కు ఏది ఉపయోగపడుతుందో అది మాత్రమే ఎంచుకొని టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది రశ్మిక.
ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్ చర్చలో చివరికి రశ్మిక పేరు రావడంతో అయ్యా.. అమ్మడిని కొట్టేవారు టాలీవుడ్ లోనే లేరా అని నెటిజన్స్ నోర్లు నొక్కుకుంటున్నారు. ప్రస్తుతం రశ్మిక నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్ వైపు సినీ ఫ్యాన్స్ చూపు సాగుతోంది. ఈ సినిమా బంపర్ హిట్ ఖాయమని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో థామా, కాక్ టెయిల్ మూవీస్ లోనూ రశ్మిక తనదైన బాణీ పలికించబోతోంది. ఈ సినిమాలు అనుకున్నట్టు విజయం సాధిస్తే టాలీవుడ్ లో ఏంటి ఏకంగా ఆల్ ఇండియా నంబర్ వన్ హీరోయిన్ గానూ రశ్మిక సాగినా ఆశ్చర్యపోనక్కరలేదు.
Power Star: పవన్ కళ్యాణ్ ఓజీకి తెలంగాణలో ఎదురుదెబ్బ...
Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్లన్న అన్నది ఎవరిని.. ?