Rama Satyanarayana: 'కె.పి.హెచ్.బి. కాలనీలో' తొలి షెడ్యూల్
ABN , Publish Date - Sep 04 , 2025 | 07:24 PM
ఆగస్ట్ 15న తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రారంభించిన 15 సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ నిదానంగా మొదలవుతున్నాయి. తాజాగా అందులోని 'కె.పి.హెచ్.బి. కాలనీలో' షూటింగ్ ను ప్రారంభించారు.
భీమవరం టాకీస్ బ్యానర్ లో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (Thummalapalli Rama Satyanarayana) నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'కె.పి.హెచ్.బి. కాలనీలో' (KPHB Colony Lo) . ఈ సినిమా తొలి షెడ్యూల్ ను ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ, 'సి.ఐ. తుమ్మా గోపీ గారు పదేళ్ళ క్రితం నా షార్ట్ ఫిల్మ్ కి క్లాప్ కొట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆయన తన పోలీసు బృందంతో కలిసి నా సినిమాకు క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలియచేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. అతి త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ, 'ఇది సందేశ ప్రధానమైన చిత్రం. అదే సమయంలో వినోదాన్ని అందిస్తూ, రిచ్ గా దీనిని తెరకెక్కించబోతున్నాం. మా సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ గణపతి దేవుడి దగ్గర పూజ అనంతరం మొదలు అవుతున్నాయి' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం ప్రణయ్ రాజ్, రాము, వరుణ్ వద్దేటి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Akhanda2: డిసెంబర్‌లో అఖండ2.. రిలీజ్ డేట్ చెప్పేసిన బాలయ్య
Also Read: Mouli Tanuj Prashanth: 'మ్యాడ్ సీక్వెల్'కు మౌళి నో చెప్పాడా...