సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kishkindhapuri: రెండో రోజుకు ఊపందుకున్న కిష్కింధపురి..

ABN, Publish Date - Sep 14 , 2025 | 04:49 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా కౌశిక్ పెగలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కిష్కింధపురి (Kishkindhapur).

Kishkindhapuri

Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా కౌశిక్ పెగలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కిష్కింధపురి (Kishkindhapur). ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 12 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అయితే మొదటి రోజుతో పోలిస్తే.. రెండో రోజుకు ఈ సినిమా మంచి ఊపందుకోవడం హైలైట్ గా మారింది.


మొదటిరోజున వచ్చిన మౌత్ టాక్ తో సినిమా రోజురోజుకు పాజిటివ్ టాక్ ను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు 50వేల టికెట్స్ బుక్ అవ్వగా రెండవ రోజు ఏకంగా 75వేల టికెట్స్ బుక్ అయ్యాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హర్రర్ ఎలిమెంట్స్, అనుపమ యాక్టింగ్ బావున్నాయని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. దీంతో సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.


ఇక మొదటిరోజు కన్నా ఎక్కువ టికెట్స్ రెండోరోజు కొనుగోలు అవ్వడంతో సినిమాపై ఒక పాజిటివ్ టాక్ వచ్చినట్లే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. నేడు సండే కావడంతో ఇంకా టికెట్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకోపక్క కలక్షన్స్ కూడా బాగానే రాబడుతుందని టాక్ నడుస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా బాగానే జరిగిందని టాక్ నడుస్తోంది. మరి బెల్లకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడా.. ? లేదా అనేది కొన్నిరోజుల్లో తెలుస్తోంది.

RGV: మంచు మనోజ్ నటన చూసి చెంపదెబ్బ కొట్టుకున్నాను

Gopala Krishna: క్రమశిక్షణ, అంకితభావం 'లక్ష్మణరేఖ'గా ముందుకు...

Updated Date - Sep 14 , 2025 | 06:19 PM