RGV: మంచు మనోజ్ నటన చూసి చెంపదెబ్బ కొట్టుకున్నాను
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:48 PM
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను ఏరికోరి తెచ్చుకొనే వర్మ ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్నాడు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను ఏరికోరి తెచ్చుకొనే వర్మ ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వర్మకు ఒక సినిమా నచ్చింది అంటే దాని గురించి సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. అందులో తనకు నచ్చిన సీన్స్ .. దానికి విశ్లేషణ కూడా ఇస్తూ రివ్యూ చెప్పుకొస్తాడు. తాజాగా వర్మ.. మిరాయ్ రివ్యూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు.
'మిరాయ్ చూసిన తర్వాత, చివరిసారిగా VFX ఇంత గ్రాండ్ గా ఎప్పుడు అనిపించిందో నాకు గుర్తులేదు. చివరకు 400 కోట్లకు పైగా ఖర్చు చేసిన సినిమాల్లో కూడా. హే మనోజ్.. నిన్ను మిరాయ్ లో అనవసరంగా తీసుకున్నారని అనుకున్నాను. నీ నటన చూశాక నన్ను నేను చెంపదెబ్బ కొట్టుకున్నాను. హే తేజ సజ్జా.. నువ్వు ఇంత పెద్ద ఎత్తున యాక్షన్ సినిమాలో చాలా చిన్నవాడివిగా కనిపిస్తావేమో అనుకున్నాను. కానీ, రెండోసారి కూడా తప్పులో కాలేశాను.
విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు స్క్రీన్ ప్లే నిర్మాణం చాలా బాగుంది. కథలో చాలా లీనమయ్యే క్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, బిల్డప్, భక్తి.. ఇలా చాలా ఉన్నాయి. కత్తులు, మంత్రాలు, తాంత్రిక విద్యలతో పాటు.. ప్రేమ, త్యాగం, ద్వేషం లాంటివి చూపించడంలో కూడా ఫెయిల్ అవ్వలేదు. హే.. కార్తీక్. మొత్తం మీద మిరాయ్ విజయం.. నువ్వు కన్న కల అనిపిస్తుంది. కథకు విజువల్స్ తో పాటు పురాణాన్ని కలిపి దానికి హీరోయిజాన్ని జోడించి చూపించిన విధానాన్ని బట్టి నీకు అన్ని విభాగాల్లో పట్టు ఉందని నిరూపించావు.
హే టీజీ విశ్వప్రసాద్.. , సినిమా కుటుంబ నేపథ్యం నుండి రాకపోయినా, మీ వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోకుండా మీపై మీరు నమ్మకం ఉంచారని ఈ సినిమా బట్టి తెలుస్తోంది. ఇక వీటికి తోడు అదృష్టం ధైర్యవంతులకు అనుకూలంగా ఉంటుందని నిరూపించారు. చిత్ర బృందం పని కేవలం లాభాలను అందుకోవడం మాత్రమే కాదు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కొన్ని షాట్లు శ్లోకాలు లాగా అనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సీన్స్ ఆచారాలులాగా అనిపించాయి. చివరగా నేను చెప్పేది ఒక్కటే ఇది పెద్దగా ఉండటానికి ప్రయత్నించిన చిన్న సినిమా కాదు - ఇది వాస్తవానికి చాలా పెద్ద సినిమా, ప్రేక్షకులు దానిని ప్రోత్సహించే వరకు దాని గురించి గొప్పగా చెప్పుకోరు. చిత్రబృందానికి మరోసారి నా అభినందనలు' అంటూ రాసుకొచ్చాడు.
Gopala Krishna: క్రమశిక్షణ, అంకితభావం 'లక్ష్మణరేఖ'గా ముందుకు...
Lord Rama In Mirai: 'మిరాయ్' శ్రీరాముడి ముచ్చట్లు