సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chennai Love Story: నివికి శుభాకాంక్షలు చెప్పిన స్టీవెన్ శంకర్...

ABN, Publish Date - Nov 13 , 2025 | 12:01 PM

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న సినిమా 'చెన్నయ్ లవ్ స్టోరీ'. హీరోయిన్ శ్రీగౌరి పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో కిరణ్‌ అబ్బవరం స్టీవెన్ శంకర్ అనే పాత్ర పోషిస్తున్నాడు.

Chennai Love Story

స్టీవెన్ శంకర్... ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా! అవును పదకొండేళ్ళ క్రితం సంపూర్ణేశ్‌ బాబు (Sampurnesh Babu) హీరోగా నటించిన 'హృదయకాలేయం' (Hrudaya Kaleyam) మూవీ దర్శకుడి పేరది. స్టీవెన్ శంకర్... ఇదేం పేరు అని చాలామంది అప్పట్లో అనుకున్నారు. ఇది ఆ సినిమా దర్శక నిర్మాత సాయి రాజేశ్‌ స్క్రీన్ నేమ్. తెలుగు సినిమా రంగంలో ఓ సంచలనం 'హృదయ కాలేయం'. ఆ తర్వాత సాయి రాజేశ్‌ 'కొబ్బరిమట్ట' (Kobbari Matta) మూవీని తెరకెక్కించారు. ఇక ఆయన డైరెక్ట్ చేసిన 'బేబీ' (Baby) తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యి, ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు పలు అవార్డులనూ గెలుచుకుంది. విశేషం ఏమంటే... సాయి రాజేశ్‌ (Sai Rajesh) దాదాపు పుష్కరకాలం గడిచిపోయినా... తన తొలి స్క్రీన్ నేమ్ ను మర్చిపోవడం లేదు... తాజాగా ఆయన కథతో తెరకెక్కుతున్న 'చెన్నయ్ లవ్ స్టోరీ' (Chennai Love Story) మూవీలో హీరో కిరణ్‌ అబ్బవరంకు 'స్టీవెన్ శంకర్' అనే పేరే పెట్టారు. ఈ సినిమాను ఎస్.కె.ఎన్. (SKN) తో కలిసి సాయి రాజేశ్ నిర్మిస్తున్నాడు. 'చెన్నయ్ లవ్ స్టోరీ' (Chennai Love Story) ని రవి నంబూరి (Ravi Namburi) డైరెక్ట్ చేస్తున్నాడు.


నవంబర్ 13న ఈ సినిమా హీరోయిన్ శ్రీగౌరి ప్రియ (Srigouri Priya) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె నివి అనే పాత్రను పోషిస్తోంటే... హీరో కిరణ్‌ అబ్బవరం స్టీవెన్ శంకర్ గా యాక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ ఈ లవ్ స్టోరీకి మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ పుట్టిన రోజు సందర్భంగా ఆమె తమ చిత్రబృందానికి ఉన్న అనుబంధాన్ని నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. తెలియచేస్తూ... 'ఆమె కథను వినడానికి మా దగ్గరకు వచ్చిన రోజు ఇంకా గుర్తుంది. కథ వినగానే, శ్రీగౌరి ప్రియ చాలా ఎగ్జైట్ అయ్యింది. నిమిషాల్లో ఈ సినిమా చేయడం తన అదృష్టం' అని చెప్పింది. డేట్స్ క్లాష్ అవుతున్నాయని ఈ సినిమాకు కోసం ఆమె మరో మూవీని కూడా వదిలేసుకుంది. ఆమె ఎనర్జీని మీరు ప్రతి సన్నివేశంలోనూ చూడొచ్చు. కిరణ్‌ అబ్బవరంతో కలిసి ఆమె మీ మనసుల్ని దోచుకుంటుందని తెలుసు. పవర్ హౌస్ పెర్ఫార్మర్, తెలుగు అమ్మాయి శ్రీగౌరిప్రియకు జన్మదిన శుభాకాంక్షలు' అని తెలిపారు.

Also Read: Friday Tv Movies: శుక్ర‌వారం, Nov 14.. తెలుగు టీవీ ఛాళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు ఇవే

Updated Date - Nov 13 , 2025 | 12:02 PM