Rithu Chowdary: అర్ధరాత్రుళ్లు మాత్రమే నా ఇంటికి వచ్చి.. నా భర్తతో.. గౌతమీ చౌదరి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:03 PM

రీతూ చౌదరి (Rithu Chowdary).. ప్రస్తుతం ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 9 (Biggboss9) లో కంటెస్టెంట్ గా ఆమె కొనసాగుతుంది.

Rithu Chowdary

Rithu Chowdary: రీతూ చౌదరి (Rithu Chowdary).. ప్రస్తుతం ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 9 (Biggboss9) లో కంటెస్టెంట్ గా ఆమె కొనసాగుతుంది. బిగ్ బాస్ 9 లో కొద్దోగొప్పో తెల్సిన ముఖాల్లో రీతూ ఒకరు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి నటిగా.. జబర్దస్త్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును అందుకుంది. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ విమర్శలు ఎదుర్కొంటూనే ఫేమస్ అయ్యింది.


కెరీర్ అంతా వివాదాలే

రీతూ కెరీర్ అంతా వివాదాలతోనే సాగింది. తండ్రి చనిపోయినా వెంటనే బికినీలో ఫొటోలుపెట్టి సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. అయితే అవి ఫేక్ ఫోటోలు అని ఆ తరువాత ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఎవరికి తెలియకుండా శ్రీకాంత్ చీమకుర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి రూ. 700 కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ స్కామ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన భర్త నుంచి ఎప్పుడో విడిపోయానని రీతూ చెప్పుకొచ్చి బయటపడింది.


బిగ్ బాస్ లో ఓవర్ యాక్షన్

ఇక ఆ స్కామ్ ద్వారా వచ్చిన గుర్తింపుతో అమ్మడు బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడైనా మంచిగా గేమ్ ఆడి.. ఆడియెన్స్ ను గెలుచుకుంటుంది అనుకుంటే.. అక్కడ కూడా రీతూ బుద్ధి చూపించింది. ఒకపక్క కళ్యాణ్ తో.. ఇంకోపక్క డిమోన్ పవన్ తో రాసుకుపూసుకు తిరగడం, మాట మీద నిలబడకుండా వేరొకరి ఆటను, అవకాశాన్ని పోగొట్టడం చేయడంతో ప్రేక్షకులు.. రీతూపై ఫైర్ అవుతున్నారు. కనీసం నాగార్జున, బిగ్ బాస్ కూడా గౌరవం ఇవ్వకుండా పొగరు చూపిస్తుందని మండిపడుతున్నారు.


గుట్టు బయటపెట్టిన గౌతమీ చౌదరి

ఇక బిగ్ బాస్ లో రీతూ చేసే పనులకు మండిపోయి ఉన్న అభిమానులకు రీతూ వీడియో ఒకటి బయటకు వచ్చింది. భార్యను వేధించి.. ఈ మధ్యనే పోలీస్ కేసులో ఇరుక్కున్న నటుడు ధర్మ మహేష్ తో కలిసి రీతూ అర్ధరాత్రి లిఫ్ట్ లో నుంచి రావడం, ఆమె చేతిలో ఏదో ఒక చిన్న డబ్బా ఉండడం ఆ వీడియోలో కనిపిస్తుంది. వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక రీతూపై గౌతమీ సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రీతూకి తన భర్త మహేష్ కు ఎఫైర్ ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.


అర్ధరాత్రుళ్లు మాత్రమే వస్తుంది

రీతూ.. మహేష్ కు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉంది. చాలాసార్లు నేను లేకుండా ఆమె నా ఇంటికి వచ్చి వెళ్తుంది. అది కూడా అర్ధరాత్రి 1 గంటకు వచ్చి 4 గంటలకు వెళ్ళిపోతుంది. ఆ సమయంలో నా భర్తతో ఆమెకు ఏం పని..? ఉదయం ఎందుకు రాదు. నేను ఇంట్లో ఉన్నా కూడా వారు నన్ను పట్టించుకోరు. తాగుతారు.. ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. బిగ్ బాస్ కు వెళ్లే ముందు కూడా వీరు కలిశారు. నేను ఇంతగా పోరాడుతున్నా కూడా అది పట్టించుకోకుండా అతను.. ఆమెతో తిరుగుతున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.


రీతూ కెరీర్ పరిస్థితి ఏంటి

గౌతమీ చెప్తున్న విషయాల్లో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. అయితే వీడియోలను బట్టి.. ఆ సమయంలో వాళ్ళింట్లో ఆమె ఎందుకు ఉన్నది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా కూడా గౌతమీ.. ఇప్పుడే ఎందుకు బయటపెట్టింది. బిగ్ బాస్ లో ఆమెను బ్యాడ్ చేయాలనా.. ? లేకవేరే కారణం ఏదైనా ఉందా.. ? ఇంత జరిగాకా హౌస్ నుంచి బయటకు వచ్చిన రీతూ పరిస్థితి ఏంటి. ఇప్పటికే ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమెను బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇన్ని అడ్డంకుల నుంచి రీతూ ఎలా బయటపడుతుంది అనేది చూడాలి.

Tv Industry: తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌, ఓటిటి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కొత్త టీమ్ ఇదే 

Amir Khan: హీరోల‌కే కాదు.. వారికి పారితోషికాలు పెంచాలి

Updated Date - Sep 23 , 2025 | 05:03 PM