Pawan Kalyan: ఓజీకి పవన్ వంద కోట్లు.. ఇమ్రాన్ హష్మీకి ఎంతంటే
ABN , Publish Date - Sep 23 , 2025 | 03:16 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ (Priyanka Mohan) జంటగా కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓజీ (OG).
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ (Priyanka Mohan) జంటగా కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓజీ (OG). డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చిపెట్టాయి.
ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 25 వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న తరుణంలో ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఓజీ మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్.. ఈ సినిమా కోసం వంద కోట్లు అందుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. అప్పటికీ ఇంకా పవన్ డిప్యూటీ సీఎం కాలేదు. ప్రచారం కోసం ముందే అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని, వంద కోట్లలో 50 కోట్లు మేకర్స్ ముందే ఇచ్చారని వార్తలు వినిపించాయి.
ఇక ఇప్పుడు ఓజీ కోసం పవన్ వంద కోట్లు అందుకోలేదని.. రూ. 80 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. ఇది కూడా చిన్న అమౌంట్ ఏమి కాదు. ఇక పవన్ తో ఎవరూ పోటీకి రాలేదు కానీ, కుర్ర డైరెక్టర్ సుజీత్ సైతం ఓజీకి దాదాపు రూ. 8 కోట్లు అందుకున్నాడని అంటున్నారు. ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ హష్మీ రూ. 5 కోట్లు అందుకోగా.. నందమూరి థమన్ కూడా ఓజీకి రూ. 5 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇక ఓజీ భామలు ప్రియాంక మోహన్ కు కోటిన్నర ముట్టిందని, కీలక పాత్రలో నటించిన శ్రేయా రెడ్డికి రూ. 50 లక్షలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Mirai: ఫ్యాన్స్ డిమాండ్.. నేటి నుంచి థియేటర్ లో వైబ్ ఉందిలే
Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీతో.. సుహాసిని..