Manchu Vishnu: ఓవర్సీస్ లో కన్నప గ్రాండ్ రిలీజ్...
ABN, Publish Date - Jun 23 , 2025 | 03:40 PM
మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించిన 'కన్నప్ప' చిత్రం విదేశాలలో జూన్ 26న ప్రదర్శితం కానుంది. దీనిని అమెరికాలో వాసరా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పంపిణీ చేస్తోంది.
ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబు (Mohan Babu) నటించి, నిర్మించిన చిత్రం 'కన్నప్ప' (Kannappa). మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ పోషించిన 'కన్నప్ప' ఈ నెల 27న పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతోంది. ఈ సినిమాను వాసరా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ యు. ఎస్.లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. విదేశాల్లో ఈ మూవీని 26న ప్రదర్శించబోతున్నట్టు పంపిణీ సంస్థ తెలిపింది.
ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం భారీ ఎత్తున రిలీజ్ కు ప్లానింగ్ చేశామని వాసరా ఎంటర్ టైన్ మెంట్స్ ప్రతినిధి తెలుపుతూ, థియేటర్ల జాబితాను విడుదల చేశారు. బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో 'కన్నప్ప' ట్రెండ్ అవుతోందని వారు తెలిపారు. నిజానికి మంచు విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్ ను ముందుగా అమెరికాలోనే మొదలు పెట్టారు. ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో విష్ణు ఉన్నారు. 'కన్నప్ప' చిత్రీకరణ మొత్తం దాదాపుగా న్యూజిలాండ్ లోనే జరిగింది. అలానే ఇది డివోషనల్ మూవీ కావడంతో విదేశాలలోని భారతీయులంతా దీనిని తప్పకుండా ఆదరిస్తారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి ప్రముఖులు నటించిన ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ యాక్ట్ చేసింది. 'మహాభారతం' టీవీ సీరియల్ ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read: Sriram Srikanth: డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ శ్రీకాంత్ అరెస్ట్...
Also Read: Amitabh Bachchan: షోలే రిటర్న్స్....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి