Sriram Srikanth: డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ శ్రీకాంత్ అరెస్ట్..
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:33 PM
చెన్నెలోని నుంగంబాక్కం పోలీసులు హీరో శ్రీరామ్ శ్రీకాంత్(Sriram Srikanth) ను డ్రగ్ కేసులో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
Sriram Srikanth: ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. హేమాహేమీలందరినీ భయపెట్టిన డ్రగ్స్ కేసులో తాజాగా ఒక హీరో అరెస్ట్ అయ్యాడు. చెన్నెలోని నుంగంబాక్కం పోలీసులు హీరో శ్రీరామ్ శ్రీకాంత్(Sriram Srikanth) ను డ్రగ్ కేసులో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన AIADMK మాజీ నేత ప్రసాద్ విచారణలో శ్రీరామ్ పేరు బయటపడింది. డ్రగ్ పెడ్లర్ అయిన ప్రసాద్ తో పాటు శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేయడం, వినియోగించడం చేస్తున్నాడని తెలియడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణకు తీసుకెళ్లారు. అతని రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజా పూలు, ఒకరికి ఒకరు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ తమిళ్ లో శ్రీకాంత్ అని పేరు మార్చుకున్నాడు. అక్కడ కూడా మంచి మంచి సినిమాలతో మెప్పించిన ఈ హీరో సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ గా నటించాడు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ గా శ్రీరామ్ నటించాడు. ఈ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. మంచి భవిష్యత్తు ఉన్న శ్రీరామ్ ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం అతని జీవితానికి పెద్ద మచ్చగా మారుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.