Salman Khan: ఇంటర్నేషనల్‌ స్పై మ్యూజియంలో..  ‘ఏక్‌ థా టైగర్‌’

ABN , Publish Date - Sep 09 , 2025 | 07:08 PM

సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్‌ డీసీలోని ఇంటర్నేషనల్‌ స్పై మ్యూజియంలో ఈ మూవీ పోస్టర్‌ను ప్రదర్శించారు


సల్మాన్‌ఖాన్‌ (Salman khan) నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’ (Ek Tha Tiger) సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్‌ డీసీలోని ఇంటర్నేషనల్‌ స్పై మ్యూజియంలో ఈ మూవీ పోస్టర్‌ను (Spy Museum) ప్రదర్శించారు. ఈ ఘతన సాధించిన తొలి భారతీయ సినిమా ఇది. జేమ్స్‌బాండ్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌ చిత్రాల సరసన నిలిచింది. దర్శకుడు కబీర్‌ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించారు.


‘సినిమా విజయాన్ని బాక్సాఫీసు కలెక్షన్లు మాత్రమే నిర్ణయించలేవు. ప్రేక్షకులకు ఎంత కాలం గుర్తున్నదనేది కూడా ముఖ్యం. అప్పుడు అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన ‘ఏక్‌ థా టైగర్‌’ ఇప్పుడు అంతర్జాతీయ స్థ్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.  యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి చిత్రం ‘ఏక్‌ థా టైగర్‌’. ‘రా’ ఏజెంట్‌గా సల్మాన్‌, ఐ.ఎస్‌.ఐ. ఏజెంట్‌గా కత్రినా కైఫ్‌ నటించారు. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 2012 ఆగస్టు 15న విడుదలైంది. రూ.330 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది.  

Updated Date - Sep 09 , 2025 | 07:15 PM