JR NTR: ‘కాంతార చాప్టర్ 1’ ఎన్టీఆర్ రియాక్షన్..
ABN , Publish Date - Oct 02 , 2025 | 02:41 PM
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్ 1’ (Kantara chapter 1) దసరా సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్ 1’ (Kantara chapter1) దసరా సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిపై టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘కాంతార ఛాప్టర్ 1’ టీమ్‌ను అభినందించారు. నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టిపై ప్రశంసలు కురిపించారు. ‘చక్కని విజయం సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ టీమ్‌కు అభినందనలు. ముఖ్యంగా రిషబ్‌శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. ఆయనపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లిన హోంబలే ఫిల్మ్స్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ALSO READ: Kanthara: Chapter 1 Review: కాంతార చాప్టర్ 1 రివ్యూ
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన తారక్ ‘కాంతార’ను ఈ స్థాయిలో తెరకెక్కించడం రిషబ్‌కు మాత్రమే సాధ్యమని చెప్పిన సంగతి తెలిసిందే. 2022లో వచ్చి భారీ విజయం సొంతం చేసుకుని, నేషనల్ అవార్దు దక్కించుకున్న ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి భారీ విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది.
ALSO READ: Pawan Kalyan: ఓజీ యూనివర్స్ సినిమాలు చేస్తా.. ఎలాగంటే..
Tollywood Upadates: దసరా వేళ.. సినిమా అప్‌డేట్ల కళ..