Pawan Kalyan: ఓజీ యూనివర్స్ సినిమాలు చేస్తా.. ఎలాగంటే..
ABN , Publish Date - Oct 02 , 2025 | 11:33 AM
‘నేను సినిమాలు చేసి భుక్తి కోసం. రాజకీయాలు నాకు దేశ సేవ. వ్యక్తిగా సమాజం కోసం చేస్తున్న పని అది. అంతే తప్ప పదవుల కోసం కాదు. పదవి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. దానికోసం ఎప్పుడూ ఆశ పడలేదు. డబ్బుకోసం నాకు సినిమా కావాలి కానీ, నేను సమయం ఇవ్వలేను.
‘నేను సినిమాలు చేసి భుక్తి కోసం. రాజకీయాలు నాకు దేశ సేవ. వ్యక్తిగా సమాజం కోసం చేస్తున్న పని అది. అంతే తప్ప పదవుల కోసం కాదు. పదవి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. దానికోసం ఎప్పుడూ ఆశ పడలేదు. డబ్బుకోసం నాకు సినిమా కావాలి కానీ, నేను సమయం ఇవ్వలేను. ఏ ఉద్యోగికేౖనా సెలవులు ఉంటాయి కదా, అలా సెలవుల్లోనో లేదంటే పనిలేని సమయంలోనే ‘ఓజీ’ (OG Movie) యూనివర్స్ సినిమాలు చేద్దామని సుజీత్‌కి చెప్పా’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన సెప్టెంబరు 25న విడుదలైన 'ఓజీ' చిత్రం నాలుగు రోజుల్లో రూ.252 కోట్లకుపైగా వసూలు చేసి, రూ.300 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. సినిమా సక్సెస్‌లో భాగంగా ఓజీ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్ పేరుతో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్‌లకు షీల్డ్‌లను అందించారు పవన్(Pawan Kalyan). అనంతరం వర్షంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుర్తుచేసుకుని నవ్వులు పూయించారు. జీవితంలో ఎప్పుడూ అలా చేయలేదన్నారు. (OG Success Celebrations)
పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కటానాతో వేదికపైకి రావాలని సుజీత్, తమన్ కోరారు. దాన్ని పట్టుకోవడం నాకో సమస్య అయితే, దానికి తోడు ఆ రోజు వర్షం వచ్చింది. నా జీవితంలో ఇలా ఎప్పుడూ చేయలేదు. టీమంతా నాతో ఆడుకుంటున్నారు అని అనుకున్నా. ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్‌కు బ్లాక్ డ్రెస్సు, కళ్లజోడు, తుపాకీ పట్టుకుని రావాలన్నారు. నేను ఒప్పుకోలేదు.. చంపేస్తా అన్నా. గన్ నా వీక్‌నెస్ అని తెలుసుకుని నాతో ఆడుకుంటున్నారు’ అంటూ సరదాగా మాట్లాడారు.
‘నువ్వే కొత్త.. నువ్వేం చేస్తావ్’ అనేవారు.
‘నేను సినిమాని వేడుకల జరుపుకోవడం చాలా తక్కువ. అది ఓజీ సినిమా సక్సెస్ వల్ల మా టీమ్‌కు సాధ్యమైనందుకు ఆనందంగా ఉంది. సినిమా ఒప్పుకున్నాక నా వంతు చేయాల్సింది అంతా నిజాయతీగా చేసుకుంటూ వెళ్లిపోతా. కథ చెప్పడం అనేది గొప్ప ఆర్ట్. సినిమా ఏదైనా కష్టం అందరిదీ ఒకేలా ఉంటుంది. కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. దర్శకుడు సుజీత్‌లో నాకు నేను కనిపిస్తా. ఇప్పటి దర్శకుల గురించి నేను, త్రివిక్రమ్ మాట్లాడుకుంటున్న తరుణంలో సుజీత్ ప్రస్తావన వచ్చింది. సుజీత్ టాలెంట్ గురించి ఆయనే నాకు చెప్పారు. అలా ‘ఓజీ’ ప్రయాణం మొదలైంది. ఓజీ కథ ఏంటనేది ఇప్పటిదాకా అతను నాకు చెప్పలేదు. స్టోరీ కన్నా ముందు విజువల్స్ చూపించేవాడు సుజీత్. కెరీర్ ప్రారంభంలో నా మైండ్ కూడా విజువల్స్‌తో నిండిపోయేది. మేకింగ్ గురించి ఎవరికైనా చెబితే.. ‘నువ్వే కొత్త.. నువ్వేం చేస్తావ్’ అనేవారు. అప్పటి నా ఆలోచనల్ని షార్ట్ ఫిల్మ్స్‌గా తీసేవాడిని. సుజీత్‌లో ఎంతో మ్యాటర్ ఉందిగానీ పైకి చెప్పలేకపోయేవాడు. ఓజీ విషయంలో నాకు ఎలివేషన్స్ గురించి కాదు ఓ తండ్రి కథ చెప్పాడు. అదే తెరకెక్కించాడు. ‘జాని’ ఫెయిల్యూర్ కాబట్టి దాని రిఫరెన్స్ ‘ఓజీ’లో పెట్టడంతో ఎందుకు అని టెన్షన్ పడ్డా. కానీ కొన్ని సార్లు నమ్మి, ముందుకెళ్లిపోవాలి. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. టీమ్ అంకృషి ఫలితం ఈ సినిమా సక్సెస్’ అని అన్నారు.
సెట్‌లో రాజకీయాలు వద్దని ముందే చెప్పా..
‘జయాపజయాలకు నేనెప్పుడూ భయపడలేదు, భయపడను కూడా. ‘హరి హరి వీరమల్లు’కి కూడా నా వంతుగా అత్యుత్తమంగా ఇవ్వడానికే ప్రయత్నించా. మిగతా సినిమాలు చేస్తున్నప్పుడు టన్నులకొద్దీ బరువు నాపై ఉంటుంది. ఫలితం మాత్రం పిసరంతే వస్తుంటుంది. ఓజీ జర్నీలో సుజీత్ ఏమాత్రం బరువు ఇవ్వలేదు. బృంద స్ఫూర్తికి నిదర్శనం ఈ సినిమా విజయం. సమైక్యతను పెంచే ఓ గొప్ప కళ సినిమా. అభిప్రాయ భేదాలు ఉన్న వారిని కూడా సినిమా కలుపుతుంది. ప్రకాశ్‌రాజ్‌కి నాకు మధ్య సైద్థాంతిక భేదాలు ఉన్నా సినిమా కోసం కలిసి పనిచేశాం. అయితే సెట్‌లో రాజకీయాల గురించి మాట్లాడవద్దని టీమ్‌తో ముందే చెప్పాను. సమాజానికి ఏదన్నా చెప్పాలనుకుంటే అది సినిమా మాధ్యమం ద్వారా బలంగా బయటకు వెళ్తుంది. సినిమాల, దాని వల్ల వచ్చిన అభిమానగణం వల్లే నటుడిగా, ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా మీముందు ఈ స్థాయిలో ఉన్నాను. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ‘ఓజీ’ సినిమా చూశా. ఆ సమయంలో.. ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ చేద్దామనే ప్రస్తావన వచ్చింది. తప్పకుండా చేస్తానని దర్శకుడు సుజీత్‌కు మాటిచ్చా. కానీ ఈ సినిమా చేయడానికి కొన్ని షరతులుంటాయని వారికి చెప్పాను. సెలవుల్లోనో లేదంటే పనిలేని సమయంలోనే ‘ఓజీ’ యూనివర్స్ సినిమాలు చేస్తా’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.